ర్యాలంపాడు రిజర్వాయర్‌కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేయడానికి ప్రభుత్వం రూ. 4.92 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.1.66 కోట్లు సీడబ్ల్యూపీఆర్‌సీ పుణెకు, మిగిలిన రూ. 3.66 కోట్లతో రిజర్వాయర్‌కు ఏర్పడిన లీకేజీలకు పూర్తిస్థాయిలో మరమ్మతు చేయాలని నిర్ణయించారు. అయితే రిజర్వాయర్ ఆనకట్టలోని రాక్‌టోల్ లేయర్ల మట్టి నమూనాలు, తూముల అడుగు భాగంలోని నమూనాలను పరీక్షల నిమిత్తం పుణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్‌సీకి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్ష ఫలితాల అనంతరం వచ్చే తుది నివేదిక ఆధారంగా రిజర్వాయర్‌కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేపట్టనున్నారు.
త్వరలోనే పనులు..
ర్యాలంపాడు రిజర్వాయర్ లీకేజీలకు మరమ్మతు కోసం ప్రభుత్వం రూ. 4.92కోట్లు మంజూరు చేసింది. పుణె నుంచి వచ్చే తుదినివేదిక ఆధారంగా త్వరలోనే రిజర్వాయర్‌కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేపట్టి.. పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం.
– రహీముద్దీన్, ఎస్‌ఈ, ఇరిగేషన్ శాఖ
●


