అలంపూర్: డిజిటల్ క్రాప్ సర్వేను సకాలంలో పూర్తిచేయాలని ఏడీఏ సక్రియా నాయక్ అన్నా రు. అలంపూర్ మండలం కోనేరులో మంగళవారం డిజటల్ క్రాప్ సర్వేను ఆయన పరిశీలించి మాట్లాడారు. వలంటీర్ల ద్వారా యాసంగి పంటల నమోదు చేపడుతున్నట్లు తెలిపారు. అలంపూర్ మండలంలో 8,478 పంట సర్వే నంబర్లు నమోదు చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు 2600 సర్వే నంబర్లలో పంటల నమో దు పూర్తిచేసినట్లు వివరించారు. ఈ నెల 20వ తేదీలోగా సర్వేను పూర్తిచేయాలని వలంటీర్లకు సూచించారు. కార్యక్రమంలో ఏఓ నాగార్జునరెడ్డి, ఏఈఓలు నీలిమ, శ్రీధర్ పాల్గొన్నారు.


