ఎర్రవల్లి: విద్యార్థులు చెడు స్నేహాలకు దూరంగా ఉండి, సన్మార్గంలో పయనిస్తేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని పదవ బెటాలియన్ కమాండెంట్ జయరాజు అన్నారు. మంగళవారం బెటాలియన్ సాయుధ చైతన్య పాఠశాలలో నిర్వహించిన స్వయం పరిపాలన దినోత్సవం, పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకుని ముందుకుసాగాలని సూచించారు. ముఖ్యంగా పోటీ పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొని మంచి ఫలితాలు సాధించాలన్నారు. భవిష్యత్‌లో ఉన్నత చదువులకు వెళ్లినప్పుడు ఎలాంటి ప్రలోభాలకు గురికాకూడదని సూచించారు. అనంతరం పదో తరగతి విద్యార్ధులకు పెన్నులు అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ నరేందర్‌రెడ్డి, ఆర్‌ఐలు శ్రీనివాసులు, ఆర్‌పీ సింగ్, పాఠశాల ప్రిన్సిపాల్ శేషావలి తదితరులు పాల్గొన్నారు.


