రాజీ కేసులపై స్పెషల్‌ డ్రైవ్‌ | - | Sakshi
Sakshi News home page

రాజీ కేసులపై స్పెషల్‌ డ్రైవ్‌

Mar 10 2026 7:25 AM | Updated on Mar 10 2026 7:25 AM

గద్వాల క్రైం: పెండింగ్‌ కేసుల విషయంలో పురోగతి సాధించేందుకు సమయస్ఫూర్తితో అడుగులు వేశామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవికుమార్‌ అన్నారు. సోమవారం జిల్లా కోర్టు ఆవరణలో పోలీసు శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని పెండింగ్‌ కేసులు, రాజీ కాదగిన కేసులపై ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టామన్నారు. ఈ నెల 28న జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నామన్నారు. గతంతో పోలిస్తే నేటికీ చాలా అంశాలను పరిగణలోకి తీసుకొని కేసుల సత్వర పరిష్కారం కోసం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించడం జరిగిందన్నారు. పోలీసు, ఎకై ్సజ్‌, రెవెన్యూ, రోడ్డు ప్రమాద, బ్యాంకు రుణాలు, స్టేషన్‌లలో నమోదైన కేసుల వివరాలను ఇప్పటికే ఆ శాఖ సిబ్బందితో మాట్లాడి విపత్కర కేసుల అంశాలను అడిగి తెలుసుకున్నట్లు వివరించారు. సమావేశంలో న్యాయమూర్తులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement