ప్రజలకు అందుబాటులో వైద్యసేవలు | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు అందుబాటులో వైద్యసేవలు

Mar 5 2026 7:30 AM | Updated on Mar 5 2026 7:30 AM

మానవపాడు: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మండలంలోని జల్లాపురంలో బుధవారం అడిషనల్‌ కలెక్టర్‌, డీఆర్డీఓ నర్సింగ్‌రావు, డీఎంహెచ్‌ఓ సంధ్యా కిరణ్మయితో కలిసి ఆయన పల్లె దవాఖానా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. వైద్యసిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పల్లె దవాఖానాను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నందిని, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సిద్దప్ప, ప్రోగ్రాం ఆఫీసర్లు మహ్మద్‌ అలీ, యూకుబ్‌ బాషా, డీఈ శ్రీనివాసులు, ఏఈ రహీం, డీపీహెచ్‌ఎన్‌ఓ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement