తల్లిదండ్రుల నిఘా అవసరం
పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిత్యం నిఘా ఉంచాలి. స్నేహి తులు, బంధువులు, తెలిసినా వ్యక్తులైనా సరే వారితో ఎంత చనువుగా ఉండాలనే నియమాలను పిల్లలకు తెలియజేయాలి. గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలి. చిన్నతనంలో పిల్లలు సామాజిక మాధ్యమాల వైపు వెళ్లకుండా వీలైనంత వర కు కట్టడి చేయాలి. పని ఒత్తిడిలో తల్లిదండ్రు లు పిల్లలపై దృష్టి పెట్టని కారణంగానే చాలా వరకు చెడు దారిలో ప్రయాణిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇక నుంచైనా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి.
– ధరణి, గృహిణి, గద్వాల
మైనర్ బాలికల పట్ల ఎవరైనా అనుచితంగా వ్యవహరించిన, అత్యాచారానికి పాల్పడిన కేసు ల్లో నిందితులు తప్పించుకోలేరు. ప్రభుత్వం కఠిన చట్టం అమల్లోకి తీసుకొచ్చింది. పోక్సో కేసుల్లో నిందితులకు న్యాయస్థానంలో బెయి ల్ ఉండదు. వీలైనంత త్వరగా శిక్షలు పడేలా పోలీసు, న్యాయవ్యవస్థలు సంయుక్తంగా ప ని చేస్తున్నాయి. దాడులకు గురైన వారికి స్వే చ్ఛాయుత వాతావరణంలో రక్షణ ఉంటుంది. ఇటీవల మైనర్‌పై జరిగిన ఘటన పై పూర్తి ఆధారాలు సేకరించాం. నిందితులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసుశాఖ కట్టుదిట్టంగా వ్యవహరిస్తుంది.
– శ్రీనివాసరావు, ఎస్పీ
●
తల్లిదండ్రుల నిఘా అవసరం


