రాలుతున్న ఆశలు!
5,020 ఎకరాల్లో సాగు..
జోగుళాంబ గద్వాల
● మామిడి తోటలపై తెగుళ్ల ప్రభావం
● భారీగా నేలరాలుతున్న పూత, పిందెలు
● దిగుబడులపై
తీవ్ర ప్రభావం..
ఆందోళనలో రైతులు
● వాతావరణ మార్పులే కారణం
శనివారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
మండలం మామిడి కాపు దశలో తోటలు ఉన్నవి
కేటీదొడ్డి 2,380 1,385
గట్టు 800 690
ధరూరు 550 445
మల్దకల్ 470 355
గద్వాల 300 210
అయిజ 150 130
ఇటిక్యాల 130 120
వడ్డేపల్లి 140 120
రాజోళి 70 60
అలంపూర్ 10 5
ఉండవెల్లి 10 5
మానవపాడు 10 5
కేటీదొడ్డి శివారులోని మామిడి తోట
గద్వాలవ్యవసాయం: మామిడి రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. 15 రోజులుగా వాతావరణంలో వచ్చి న మార్పులు మామిడి తోటలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. బూడిద తెగులు, నల్లతామ ర (బ్లాక్ త్రిప్స్), తేనెమంచు పురుగు ఉధృతితో పూత, పిందెలు రాలిపోతున్నాయి. కళ్లెదుటే నేలరాలుతున్న పూత, పిందెలను చూసి రైతులు వేదనకు గురవుతున్నారు. దిగుబడులు తగ్గి ఆర్థికంగా నష్టపోతున్నామని ఆందోళన చెందుతున్నారు.
ఉద్యాన పంటలకు జిల్లాలో అనువైన పరిస్థితులు ఉన్నాయి. పండ్లతోటల సాగుకు ఎర్రటి, ఒండ్రుతో కూడిన ఎర్రటి నేలలు ఉండాలి. నడిగడ్డలో ఇలాంటి నేలల శాతం ఎక్కువగా ఉంది. సాగునీటి విషయానికి వస్తే.. జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్టులతో పా టు నెట్టెంపాడు ఎత్తిపోతల రిజర్వాయర్లు, నోటిఫైడ్ చెరువులు ఉన్నాయి. వీటన్నింటి ఫలితంగా బోరు బావుల్లో ఆశించిన స్థాయిలో నీరు ఉంటుండటంతో మామిడి, బత్తాయి, పొప్పాయి, జామ, సపోట తదితర పండ్లతోటలను సాగుచేస్తున్నారు. వీటిలో మామిడి సాగు ఎక్కువగా ఉంది. రైతు లు బేనిస, దశిరి, కేసరీ, హిమా యతీ రకాలను పండిస్తున్నా రు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 5,020 ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా.. ఈ ఏడాది 3,525 ఎకరాల్లో తోటలు కాపు దశలో ఉ న్నాయి. గత డిసెంబర్, జనవరి నుంచే మామిడి పూత పూయ డం ప్రా రంభమైంది. పూత పూ సిన నెల రోజులకు పిందెలు కాయడం.. ఆ తర్వా త నెల, రెండు నెలలకు కా య సైజు పెరుగుతూ వస్తుంది. అయితే జిల్లాలోని పలు ప్రాంతాల్లో మామిడి తోటలకు ఈసారి పూత లు బాగా వచ్చాయి. పూతలను చూసి రైతులు సంతోషపడ్డారు. వీరి సంతోషం ఎక్కువ రోజులు నిలిచే పరిస్థితి కనిపించడం లేదు.
తగ్గనున్న దిగుబడులు
వాతావరణంలో వచ్చిన మార్పులతో మామిడి తోటలకు తెగుళ్ల బెడద నెలకొంది. 15 రోజలుగా రాత్రివేళల్లో చలి, పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయి. దీనికి తోడు చాలా ప్రాంతాల్లో నల్లతామర పురుగు, తేనెమంచు పురుగు తోటల్లో వీపరీతంగా ఆశిస్తోంది. ఈ పురుగు విసర్జించే జిగురు లాంటి ద్రవాల వల్ల, బూడిద తెగుళ్లతో మామిడి పూతలు, పిందెలు రాలిపోతున్నా యి. ప్రధానంగా జనవరిలో పూత వచ్చి.. ఫిబ్రవరిలో పిందెలు వచ్చిన చోట ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. పూత, పిందెలు రాలిపోతుండటంతో దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందని రైతులు వాపోతున్నారు. ఎన్ని మందులు వాడుతున్నా తెగుళ్ల ఉధృతి తగ్గడం లేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే, మామిడి తోటలను కౌలుకు తీసుకున్న రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. పూతకు రాకముందే తోటలను కౌలుకు తీసుకుంటారు. ప్రస్తుతం వచ్చిన పూత, కాసిన పిందెలు రాలడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన చెందుతున్నారు.
రాలుతున్న ఆశలు!


