దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్, హన్మకొండ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం జిల్లాలోని అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు క్రీడలు, యువజనశాఖ జిల్లా అధికారి ఎం.కృష్ణయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 4వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. పాఠశాలల్లో 20 బాలురకు, మరో 20 బాలికలకు సీట్లు ఉంటాయన్నారు. ఎంపికై న విద్యార్థులు 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య, వసతి కల్పించనున్నట్లు తెలిపారు. 2017 సెప్టెంబర్ 1 నుంచి 2018 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులని.. ఆసక్తిగల వారు మార్చి 4వ తేదీలోగా tgss.telangana. gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు.


