పూత, పిందెలు రాలుతున్నాయి..
నాకు పదెకరాల్లో మామిడి తోట ఉంది. ఇరవై రోజుల నుంచి తోటకు బూడిద తెగు లు, తేనెమంచు పురు గు ఉధృతి ఎక్కువైంది. తెగుళ ్ల నివారణ కోసం ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. దీనివల్ల మామిడి పూత, పిందెలు రాలిపోతున్నాయి. ఈ ఏడాది పంట దిగుబడులు అధికంగా తగ్గుతాయి.
– గోపి, రైతు, వెంకటాపురం,
కేటీదొడ్డి మండలం
నాకు సొంతంగా పదెకరాల మామిడి తోట ఉంది. మరో పదెకరాలు కౌలుకు తీసుకున్నాను. తోటకు పూత బాగా వచ్చింది. అయి తే కొద్ది రోజుల నుంచి తేనెమంచు, నల్లతామర పురుగుతో పూత మొత్తం రాలిపోయింది, కాసిన పిందెలు రాలుతున్నాయి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు.
– తిమ్మయ్య, రైతు, గట్టు
ఈ ఏడాది మామిడి తోటలకు పూత బాగా వచ్చింది. కొన్ని రోజులుగా వాతావరణ మార్పులతో నల్లతామర, తేనెమంచు పురుగు ఉధృతి పెరిగిన విషయం మా దృష్టికి వచ్చింది. మామిడి తోటలకు ఆశిస్తున్న తెగుళ్ల నివారణకు తగిన సూచనలు చేస్తున్నాం. ఉద్యానశాఖ సిబ్బంది ద్వారా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తాం.
– ఎంఏ అక్బర్,
జిల్లా ఉద్యానశాఖ అధికారి
●
పూత, పిందెలు రాలుతున్నాయి..
పూత, పిందెలు రాలుతున్నాయి..


