సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు
గద్వాల(మల్దకల్): సేంద్రియ వ్యవసాయంతో అధి క లాభాలు సాధించవచ్చని, రైతులు పంటల సాగు లో రసాయనిక ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప సూ చించారు. గురువారం మల్దకల్‌లో రైతులు సాగుచేసిన వరిపంటను ఆయన పరిశీలించి.. రైతులకు పలు సూచనలు చేశారు. పంటల సాగులో రసాయనిక ఎరువుల వినియోగంతో భూ సారం దెబ్బతిని.. పంటలు నష్టపోయే అవకాశం ఉంటుందన్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనల మేర కు రైతులు పంటల సాగు చేపట్టాలని సూచించారు. ప్రధానంగా తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభా లు వచ్చే పంటల సాగుపై దృష్టిసారించాలన్నారు. అనంతరం పంటలకు ఆశించే చీడపీడల నివారణ కు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించా రు. అంతకు ముందు మల్దకల్ సింగిల్‌విండో ఎరువుల గోదాంను తనిఖీ చేశారు. డీఏఓ వెంట ఏడీఏ సంగీతలక్ష్మి, ఏఓ రాజశేఖర్, ఏఈఓలు ఉన్నారు.


