పకడ్బందీగా ‘పది’ పరీక్షల నిర్వహణ | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ‘పది’ పరీక్షల నిర్వహణ

Feb 27 2026 7:55 AM | Updated on Feb 27 2026 7:55 AM

పకడ్బందీగా ‘పది’ పరీక్షల నిర్వహణ

పకడ్బందీగా ‘పది’ పరీక్షల నిర్వహణ

గద్వాలన్యూటౌన్‌: జిల్లాలో వచ్చేనెల 14 నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పా ట్లు చేయాలని డీఈఓ విజయలక్ష్మి అన్నారు. గురువారం స్థానిక బాలభవన్‌లో పరీక్షల నిర్వహణపై చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లు, రూట్‌ ఆఫీసర్లు, కస్టోడియన్లతో నిర్వ హించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. పరీక్ష సామగ్రిని జాగ్రత్తగా భద్రపర్చాలని తెలిపా రు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌ అనుమతించరాదన్నారు. ప్రతి కేంద్రంలో క్లాక్‌రూం ఏర్పా టు చేయాలన్నారు. అన్ని కేంద్రాల్లో తప్పనిసరిగా తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం కల్పించడంతో పాటు ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉండాలని తెలిపారు. పరీక్షల నిర్వహణలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో ఏసీజీఈ శ్రీనివాస్‌, డీసీఈబీ సెక్రెటరీ ప్రతాప్‌రెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement