రేపు మెగా ఉద్యోగ మేళా
గద్వాలన్యూటౌన్: మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ నెల 27న మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.మీనాక్షీ, సీపీడీసీ మెంబర్ సాయిశ్యామ్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం కళాశాలలో ఉద్యోగ మేళా బ్రోచర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మేళాలో జస్ట్ డయల్, క్యాలిబర్, మెడ్ ప్లస్, టాషియన్, ముత్తూట్ ఫైనాన్స్ తదితర కంపెనీలు పాల్గొంటాయన్నారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న, పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఉద్యోగానికి ఎంపికై న వారికి అదే రోజు అపాయిమెంట్ లెటర్ అందిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీప్రసాద్, కేరీర్ గైడెన్స్ సెల్ కన్వీనర్ సమత, అధ్యాపకులు దేవుజా, జగన్మోహన్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.


