ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం
గద్వాల: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు జరిగిన మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పేపర్–1 పరీక్షకు 4,539 మంది విద్యార్థులకు గాను 4,407 మంది హాజరయ్యారు. జనరల్‌లో 100 మంది, ఒకేషనల్ విభాగంలో 36 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. కాగా, జిల్లా కేంద్రంలోని జ్ఞానప్రభ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ బీఎం సంతోష్ పరిశీలించారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. పరీక్షల అనంతరం జవాబుపత్రాలను సురక్షితంగా తరలించాలన్నారు. అనంతరం పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఇంటర్మీడియట్ నోడల్ అధికారి హృదయరాజు, డీఎస్పీ మొగులయ్య ఉన్నారు.
మొదటి పరీక్షకు 136 మంది గైర్హాజరు
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం


