పామాయిల్‌ సాగుతో అధిక లాభాలు | - | Sakshi
Sakshi News home page

పామాయిల్‌ సాగుతో అధిక లాభాలు

Feb 24 2026 7:09 AM | Updated on Feb 24 2026 7:09 AM

పామాయిల్‌ సాగుతో అధిక లాభాలు

పామాయిల్‌ సాగుతో అధిక లాభాలు

ధరూరు: పామాయిల్‌ తోటల సాగుతో మంచి లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యానవన అధికారి రాజశేఖర్‌ అన్నారు. సోమవారం మండలంలోని కోతులగిద్ద గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచు గోవిందమ్మ అధ్యక్షతన రైతులకు పామాయిల్‌ సాగుపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్గకాలిక, స్థిరమైన ఆదాయ వనరు పామాయిల్‌ సాగుపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. శాసీ్త్రయ పద్ధతులు, ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ చర్యలు, ప్రభుత్వం అందించే సబ్సిడీపై అవగాహన కల్పించారు. రైతులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఏఈఓ, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement