అత్యవసరంలో సీపీఆర్ తప్పనిసరి
గద్వాల క్రైం: గుండె జబ్బుల నుంచి అత్యవసర పరిస్థితుల్లో బయటపడేసి, ప్రాణాలను నిలిపే అద్భుతమైన వైద్య ప్రక్రియ సీపీఆర్ (కార్డియో పల్మోనరీ రిససీటేషన్) అని జిల్లా ఇన్‌చార్జి వైద్యాధికారి కిరణ్మయి అన్నారు. సోమవారం జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయంలో సీపీఆర్‌పై ఆర్‌బీఎస్‌కే సిబ్బందికి శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సడెన్ హార్ట్ ఎటాక్ బారినపడిన సందర్భంలో సీపీఆర్ ద్వారా ప్రాణాలను నిలపవచ్చన్నారు. విశ్వసనీయమైన వైద్య సేవలతో, ఆరోగ్య సంరక్షణలో మెరుగైన ఫలితాలను సాధించవచ్చన్నారు. రోగి ప్రాణాలను కాపాడటంలో సీపీఆర్ సమర్థవంతమైన వైద్య ప్రక్రియ అన్నారు. చాతీపై అరచేతుల సహాయంతో ఒత్తిడి ప్రయోగిస్తూ.. శ్వాస ప్రక్రియను పునరుద్ధరించాలని చెప్పారు. దీంతో అవయవాలకు రక్త సరఫరా జరిగి ప్రాణాపాయం తప్పుతుందున్నారు. సీపీఆర్ ద్వారా జీవనక్రియనాలు మూడు రెట్ల వేగంతో జరుగుతాయని పలు అధ్యయనాలు వెల్లడించాయన్నారు. సీపీఆర్‌పై పౌర సమాజానికి అవగాహన లేకపోవడంతో.. నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సిద్ధప్ప, రాజు, ఆర్‌బీఎస్‌కే నోడల్ అధికారి జయరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆరోగ్య కేంద్రం తనిఖీ
మానవపాడు: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సోమవారం జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ ప్రసూనరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె వైద్యసిబ్బంది హాజరు పట్టిక, మందుల గది, ల్యాబ్, కాన్పుల గది, ఫార్మసీ విభాగాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో వైద్య సిబ్బంది తప్పకుండా దీర్ఘకాలిక రోగాలకు మందులు పంపిణీ చేయాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ల్యాబ్‌లో డెలివరీ అయిన తల్లి, బిడ్డలను పరిశీలించి సూచనలు చేశారు. కార్యక్రమంలో హెలెన్, అక్కమ్మ, చంద్రన్న, తిరుమలరావు, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
అత్యవసరంలో సీపీఆర్ తప్పనిసరి


