ఆహార విక్రయశాలలపై పర్యవేక్షణ పెంచాలి
గద్వాలటౌన్/గద్వాలన్యూటౌన్: జిల్లా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆహార పదార్థాలు విక్రయింతే హోటల్స్, ఇతర కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు పర్యవేక్షణ పెంచాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి ఆహార భద్రత సలహ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,278 ఆహార విక్రయశాలలకు సంబంధింత శాఖల ద్వారా రిజిస్ట్రేషన్ పొందారని.. కొత్తగా ఏర్పాటుచేసిన ఆహార విక్రయశాలలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ప్రతినెలా 25 హోటళ్లలో మాత్రమే ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపుతున్నారని, వీటి సంఖ్య పెంచాలన్నారు. మూడేళ్లలో కల్తీ ఆహారం తయారు చేసిన కేంద్రాలపై 26 కేసులు నమోదు చేసి, రూ.1.50 లక్షల జరిమానా విధించిన విషయాన్ని గుర్తుచేశారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, డీఎంహెచ్‌ఓ సంధ్యా కిరణ్మయి, ఫుడ్‌సేఫ్టీ అధికారి కరుణాకర్ ఉన్నారు.
● అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రభు త్వం అందించే ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు సద్వినియోగం అయ్యేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్‌లో ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 5 నుంచి 10 తరగతులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఉపకార వేత నాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జిల్లాలో 2,617 మంది ఎస్సీ విద్యార్థులకు 1,196 మంది, 1,819 మంది బీసీ విద్యార్థులకు గాను 859 మంది మాత్రమే ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. అర్హులైన విద్యార్థులందరూ ఉపకార వేత నాలకు దరఖాస్తు చేసుకునేలా సంబందిత పాఠశాలల యాజమాన్యాలు సహకరించాలని సూచించా రు. దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన కుల, ఆదాయ ధ్రువపత్రాలు త్వరగా జారీ చేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారిణి నుషిత, బీసీ సంక్షేమశాఖ అధికారి అక్బర్ పాషా, ఎల్‌డీఎం శ్రీనివాసరావు ఉన్నారు.


