వైకుంఠ వైభవం
మహా విష్ణువును ముక్కోటి దేవతలు నేరుగా దర్శించి ఆశీస్సులు పొందిన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని మంగళవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. జిల్లా కేంద్రంలోని కోటలో వెలసిన శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామిని, కృష్ణానది తీరంలోని శ్రీకల్యాణ లక్ష్మీవేంకటేశ్వర స్వామి, భీంనగర్‌లోని సంతాన వేణుగోపాలస్వామి, గంజిపేటలోని శ్రీవేంకటేశ్వరస్వామిని వైకుంఠ నాథుడిగా భక్తులు దర్శించి దివ్యానుభూతి పొందారు. ఐదో శక్తిపీఠమైన అలంపూర్ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రం, మల్దకల్ స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి, అయిజ మండలం ఉత్తనూరు ధన్వంతరి వేంకటేశ్వరస్వామి, బీచుపల్లిలోని కోదండరామస్వామి, కేటీదొడ్డి మండలం పాగుంట శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి, రాజోళిలోని వైకుంఠ నారాయణస్వామి తదితర ఆలయాల్లో భక్తులకు వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారు దర్శనమిచ్చారు. కోటలోని ఆలయంలో సీనియర్ సివిల్‌జడ్జి లక్ష్మి ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు, అధికారులు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. – గద్వాలటౌన్
వైకుంఠ వైభవం
వైకుంఠ వైభవం


