
లబ్ధిదారులకు డబుల్‌బెడ్రూం ఇళ్లు
గద్వాల: మండలంలోని పరమాల శివారులో రూ.85 కోట్లతో నిర్మించిన 1,275 డబుల్‌బెడ్రూం ఇళ్లలో ఇప్పటి వరకే 715 ఇళ్లను లబ్ధిదారులకే కేటాయించామని, వీటిని ఈ నెల 6న అందిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు కలెక్టర్ ఎమ్మెల్యేతో కలిసి కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అధికారులతో సమీక్షించి, అనంతరం క్షేత్రస్థాయిలో డబుల్‌బెడ్రూం ఇళ్లను సందర్శించారు. ఏమైన పెండింగ్ పనులు ఉంటే వాటని పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, హౌసింగ్ పీడీ శ్రీనివాస్‌రావు, ఆర్డీఓ అలివేలు, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి, పీఆర్ ఎస్‌ఈ దామోదర్‌రెడ్డి, మిషన్‌భగీరథ ఈఈ శ్రీధర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ ప్రగతి తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 6న మంత్రి చేతుల
మీదుగా పంపిణీ