
యూరియా కోసం పడిగాపులు
అయిజ: యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి ఎండనకా.. వాననకా యూరియా పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బుధవారం అయిజ సింగిల్‌విండో కార్యాలయానికి ఉదయాన్నే పెద్ద ఎత్తున రైతులు యూరియా కోసం తరలివచ్చారు. అధికారులు వచ్చి టోకెన్లు ఇచ్చేంత వరకు ఎంత సమయం పడుతుందో తెలియక.. అంతసేపు నిలబడలేక పాదరక్షలను క్యూలో పెట్టి ఎదురుచూశారు. అనంతరం సింగిల్‌విండో సిబ్బంది పాదరక్షల ఆధారంగా రైతుల వివరాలు సేకరించి టోకెన్లు జారీ చేశారు. ఈమేరకు సింగిల్‌విండో కార్యాలయంలో యూరియా బస్తాలను అందజేశారు.