రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా రేవతి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా రేవతి

Sep 5 2025 12:30 PM | Updated on Sep 5 2025 12:30 PM

రాష్ట్రస్థాయి ఉత్తమ  ఉపాధ్యాయురాలిగా రేవతి

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా రేవతి

ధరూరు: మండలంలోని జాంపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేవతి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. అత్యధికంగా డ్రాపౌట్‌ ఎన్‌రోల్‌మెంట్‌ చేయడం, టీఎల్‌ఎం, కల్చరల్‌ కార్యక్రమాలు వంటి పది అంశాలకు సంబంధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. అందులో ప్రధానంగా ధరూరు, జాంపల్లి పాఠశాలల్లో పని చేసిన క్రమంలో చేసిన పనులకుగాను గుర్తింపు దక్కింది. శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్ప కళావేదిక, శిల్పా రామంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. చేసిన మంచి పనులను గుర్తించి ప్రభుత్వం అవార్డు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని రేవతి తెలిపారు. ఇదిలాఉండగా, మండల ఉపాధ్యాయురాలికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావడంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు, తోటి ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

సంక్షేమ పథకాలను

సద్వినియోగించుకోవాలి

గద్వాల: ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని వృద్ధిచెందాలని అదనపు కలెక్టర్‌ వి.లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం అయిజ మండలం ఈడిగోనిపల్లికి చెందిన ఎస్సీ కులానికి చెందిన మనీషా వీరేంద్ర కులాంతర వివాహం చేసుకున్నారు. ఇందుకుగాను ప్రభుత్వ పథకం ద్వారా రూ.2.50లక్షల ప్రోత్సాహక బహుమతిని మంజూరీ చేసినట్లు తెలిపారు. ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ ద్వారా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రూపంలో వీరికి బాండ్‌ను అందజేశారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమాభివృద్ధి శాఖ జిల్లా అధికారి నుషిత, మల్లిఖార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలి

గద్వాల: డబుల్‌ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవించి వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని సీనియర్‌ సిటీజన్‌ ఫోరం జిల్లా అధ్యక్షుడు కె.మోహన్‌రావు కోరారు. ఈమేరకు ఆయన గురువారం కలెక్టర్‌ బీఎం సంతోష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. పరమాల శివారులో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో ఇళ్ల స్థలాలు కోల్పోయిన వారికి ఇళ్లను కేటాయించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా ఈ నెల 6వ తేదీన రెవెన్యూ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివా్‌స్‌రెడ్డి డబుల్‌ బెడ్రూం ఇళ్లకు సంబంధించిన పట్టాలను ఇదివరకే కేటాయించిన లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తెలిసింది. ఈనేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలుచేయాలని కోరగా హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చినట్లు మోహన్‌రావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement