
మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి
గట్టు: మహిళలు స్వయం ఉపాధి వైపు దృష్టిని సారించి, ఆర్థికంగా ఎదగాలని డీఆర్‌డీఓ అడిషనల్ పీడీ శ్రీనివాస్ సూచించారు. గురువారం మండల మహిళా సమాఖ్యలో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళా సంఘాలు బలోపేతం కావడానికి సంఘం సభ్యులందరూ సహకరించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు గొర్రెలు, గేదెలు పెంపకంతో పాటుగా ఇతర పరిశ్రమలు ఏర్పాటు సహకారం అందిస్తున్నట్లు వివరించారు. కిరాణ షాపు, హోటల్స్ వంటి వాటి ధర ఆదాయ మార్గాలను పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకోవాలని కోరారు. సేంద్రియ పద్ధతిలో పంటలను పండించాలని కోరారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ చెన్నయ్య, మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్, ఎంఎస్‌ఎస్ కార్యవర్గ సభ్యురాలు వెంకటేశ్వరి, అక్షర ఇన్‌చార్జ్ ఏపీఎం జయాకర్, సీసీలు ఆంజనేయులు, రామకృష్ణ, జ్యోతి, దేవదాస్ పాల్గొన్నారు. ఇదిలాఉండగా, సమాఖ్యలో 10 ఏళ్లుగా సీసీలుగా పని చేస్తూ, బదిలీపై వెళ్తున్న ఇన్‌చార్జ్ ఏపీఎం జయాకర్, సీసీలు రామకృష్ణ, సుదర్శన్‌ను న్మానించి, అభినందించారు.