
డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి సర్వం సిద్ధం
గద్వాల: పరమాల శివారులో రూ.85కోట్లతో నిర్మించిన 1,275 డబుల్ బెడ్‌రూంలలో 715 ఇళ్లను ఇదివరకే లబ్ధిదారులకే కేటాయించడం జరిగిందని, వీటిని ఈనెల 6వ తేదీన లబ్ధిదారులకు అందిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. మంత్రి పొంగులేటి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగనున్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా అన్ని బ్లాకులో తాగునీటి వసతి, విద్యుత్ సదుపాయం, డ్రైనేజీ వ్యవస్థ వంటివి, ఎక్కడైనా మిగిలిపోయిన పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని ఇళ్లకు రంగులు వేయడం పూర్తి చేసి తోరణాలతో అలంకరించాలన్నారు. అదేవిధంగా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా పటిష్టమైన పోలీసుబందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, హౌసింగ్‌పీడీ శ్రీనివాస్‌రావు, ఆర్డీఓ అలివేలు, డీపీవో నాగేంద్రం, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.