
క్షయ నివారణ చర్యలపై జిల్లా బృందానికి అవార్డు
గద్వాల క్రైం: క్షయ నివారణ నిమిత్తం 2023లో గద్వాల క్షయ నివారణ బృందం పటిష్ట చర్యలు తీసుకొని 16వేల మంది అనుమానిత వ్యాధిగ్రస్తులకు పరీక్షలు చేపట్టిన నేపథ్యంలో ఉత్తమ అవార్డు వరించింది. శనివారం గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ చేతుల మీదుగా జిల్లా క్షయ నివారణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రాజు అవార్డు ఫర్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. దాదాపు 1500 మందిలో వ్యాధి లక్షణాలు గుర్తించి సకాలంలో వైద్య సేవలు అందించడం, క్షయ రహిత జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో వైద్య శాఖ చర్యలు అభినందనీయమని జిల్లా ఇన్‌చార్జ్ వైద్యాధికారి సిద్ధప్ప, ఇతర వైద్య సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.