
వర్షాలతో అప్రమత్తం
ఫైనాన్షియర్ల ఉచ్చులో పడి.. అనారోగ్యం పాలై..
పాడుబడ్డ ఇళ్లలో ఉండొద్దు
రానున్న 72 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
● అవసరం ఉంటేనే ఇళ్ల నుంచి
బయటకు రావాలి
● లోతట్టు ప్రాంతాలు, నదీపరివాహక ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేయండి
● కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు
● బీచుపల్లి పుష్కరఘాట్, పలు లోతట్టు ప్రాంతాల పరిశీలన
ఉండవెల్లి: మండలంలో ఐదురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలతో పొంగిపొర్లాయి. మారమునగాల–1, 2, మెన్నిపాడు గ్రామాల మధ్య వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈక్రమంలో బుధవారం ఉపాధ్యాయులు ప్రమాదమని తెలిసినా మారుమునగాల–2, మెన్నిపాడు వాగులులను దాటి పాఠశాలకు చేరుకున్నారు. గ్రామస్తులది ఇదే పరిస్థితి. అదేవిధంగా, మారమునగాల – ప్రాగటూరు, బొంకూరు – మెన్నిపాడు మధ్యలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక తక్కశీలలోని పంట పొలాలకు వెళ్లేందుకు వీలు లేక వాగు ప్రవహిస్తండడంతో బ్రిడ్జి నిర్మించాలని రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
గద్వాల/ఎర్రవల్లి/మానవపాడు: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, రానున్న 72గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని కలెక్టర్ బీఎం సంతోష్ సూచించారు. బుధవారం ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి పుష్కర్ ఘాట్ వద్ద కృష్ణానది ఉధృతిని కలెక్టర్, ఎస్పీ శ్రీనివాసరావు వేర్వేరుగా పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా అధికారులందరూ సంసిద్ధంగా ఉండాలని, అదేవిధంగా ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా మూగజీవాలు ప్రాణాలు కోల్పోకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగులందరూ సెలవులు రద్దు చేసుకుని అందుబాటులో ఉండాలన్నారు. రానున్న 72గంటల పాటు అవసరం ఉంటేనే ఇళ్లనుండి బయటకు రావాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశాలు ఉన్నందున వైద్యారోగ్యశాఖ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అన్ని పీహెచ్‌సీలు, ఆసుపత్రులలో సరిపడా మందులను అందుబాటులో ఉంచుకోవాలని, వైద్యులు, సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన వైద్యసేవలు అందించాలన్నారు.
● అలాగే, ఎర్రవల్లి మండలంలోని యాక్తాపురంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లన పనులను కలెక్టర్ పరిశీలించి పనులు వేగవంతంగా చేపట్టాలన్నారు. అవసరమైన ఇసుక, మట్టిని లబ్ధిదారులకు అందజేయాలని, నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. బి.కే.ఎస్ ట్రేడర్స్, ఫర్టిలైజర్స్ ఎరువుల గోదాములను తనిఖీ చేశారు.
లోతట్టు ప్రాంతాల్లో జర భద్రం : ఎస్పీ
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు దాటకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ టి. శ్రీనివాసరావు పోలీసులను ఆదేశించారు. బుధవారం ఎస్పీ బీచుపల్లి పుష్కరఘాట్, అమరవాయి పెద్దవాగు, మానవపాడు పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో పొలీసు యంత్రాంగాన్ని సంసిద్దం చేయడం జరిగిందని, వర్షాల సమయంలో విద్యుత్ తీగలు తెగిపోవడం, చెట్లు కూలడం, రహదారులు దెబ్బతినే అవకాశాలు ఉన్నందున ప్రజలకు ఎలాంటి సమస్య తలెత్తిన డయల్ 100, పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో రెస్క్యూ టీమ్‌లను అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. స్థానిక ప్రజలకు నిరంతరం ప్రజలకు మైక్‌అనౌన్స్‌మెంట్, సోషల్‌మీడియా ద్వారా విపత్తు నిర్వహణ విభాగంతో సమన్వయం చేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మానవపాడు పోలీస్‌స్టేషన్‌లో పలురికార్డులను పరిశీలించి, సిబ్బంది విధులను పరిశీలించారు. శాంతినగర్ సీఐ టాటాబాబు, అలంపూర్ సీఐ రవిబాబు, ఇటిక్యాల ఎస్‌ఐ రవి పాల్గొన్నారు.
మానవపాడులో నీట మునిగిన పంటలు
ఫైనాన్స్‌లో రూ.5 లక్షలను జమచేయగా.. నిర్వాహకులు తొలుత నెలకు రూ.2 చొప్పున వడ్డీ చెల్లించారు. ఆ తర్వాత ఇవ్వకపోవడంతో హరిబాబు నాగర్‌కర్నూల్‌లోని ఫైనాన్స్ కార్యాలయం, నిర్వాహకుల ఇళ్లకు నిత్యం తిరిగేవాడు. ఈ నేపథ్యంలో మనోవేదనకు గురై.. క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం దెబ్బతింది. సుమారు 8 నెలలు హైదరాబాద్‌లోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. చేతిలో డబ్బులు లేకపోవడంతో పునరావాసం కింద వచ్చిన ప్లాటును అమ్మి వైద్య చికిత్స చేయించారు. ఈ క్రమంలో 11 నెలల క్రితం చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆయన కుటుంబం దిక్కులేనిదైంది. హరిబాబుకు ఆస్పత్రి ఖర్చులు రూ.10 లక్షలకు పైగా అయ్యాయని.. అయినా బతికించుకోలేకపోయామని.. ప్రస్తుతం అప్పుల కుప్ప అయిందని ఆయన కుటుంబసభ్యులు వాపోతున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబానికి గూడు లేకపోవడంతో ముంపులోని పాత బండరాయిపాకులలో తమ చేను వద్ద కవర్‌తో కప్పిన చిన్న గుడిసెలో ఉంటున్నారు.
పుష్కరఘాట్ల దగ్గర ప్రజలు ఎవరు కూడా నీటి లోనికి దిగరాదని, పరివాహక ప్రాంతాల్లో నివసించే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని, పాడుబడ్డ ఇళ్లలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఎస్పీ సూచించారు.
అలంపూర్: అలంపూర్ నియోజకవర్గంలో బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతేరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఐదు రోజులుగా వర్షలు కురుస్తుండటంతో వాగులు, వంకల్లో భారీగా వరద నీరు చేరాయి. తెల్లవారుజామున కురిసిన వర్షాలతో మరోసారి వాగులు ఉప్పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మానవపాడు మండలంలో 36 మి.మీ వర్షం కురిసింది. ఉండవెల్లి మండలంలో 27.2 మి.మీ, ఇటిక్యాలలో 25.3 మి.మీ, రాజోలిలో 24.3 మి.మీ, వడ్డేపల్లిలో 21.5 మి.మీ, అయిజలో 16.8 మి.మీ, అలంపూర్‌లో 15.6 మి.మీ వర్షపాతం నమోదైంది. అలంపూర్ మండలంలోని పల్లా వాగు భారీ వర్షంతో ఉధృతంగా ప్రవహించింది. గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తి తన బైక్‌తో వాగు దాటే ప్రయత్నం చేశాడు. వరద ఉధృతికి బైక్ వాగు మధ్యలోనే నిలిచింది. అక్కడే ఉన్న పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు వాగులోకి వెళ్లి అతడి కాపాడి బైక్‌తో సహ వాగుదాటించారు. వాగు ఉధృతి పెరుగుతుండటంతో వాహనాల రాకపోకలు కొనసాగించకుండా ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. వాగును ఎస్‌ఐ వెంకటస్వామి సిబ్బందితో కలిసి పరిశీలించారు.

వర్షాలతో అప్రమత్తం

వర్షాలతో అప్రమత్తం

వర్షాలతో అప్రమత్తం