
కనులపండువగా కృష్ణస్వామి రథోత్సవం
మల్దకల్: కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఆదివారం స్వామి వారి రథోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారి ఉత్సవమూర్తులను భాజాభజంత్రీలతో ఆలయం చుట్టూ ఊరేగించారు. అనంతరం రథోత్సవంపై స్వామి వారి ఉత్సవమూర్తులను ఏర్పాటు చేసి దశమికట్ట వరకు లాగారు. ఈ రథోత్సవ కార్యక్రమానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు. రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులతో పాటు గట్టు, అయిజ, గద్వాల మండలాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. అలాగే ఎల్కూర్‌లో కృష్ణాష్టమి వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. సద్దలోనిపల్లి ఆలయ అవరణలో చిన్నారుల కోలాటం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.