
‘ప్రజావాణి’ ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి
గద్వాల: ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా.. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు నేరుగా కలెక్టర్‌కు 43 ఫిర్యాదులు అందించారు. వాటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపించి వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కానిపక్షంలో అందుకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్‌నాలెడ్డ్‌మెంట్ ద్వారా తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 12 అర్జీలు
గద్వాల క్రైం: ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌కు మొత్తం 12 అర్జీలు వచ్చాయి. ఎస్పీ శ్రీనివాసరావు ఫిర్యాదుదారుల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుల్లో ప్రధానంగా భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదని ఇలా 12 మంది ఫిర్యాదులు చేశారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామని, సివిల్ సమస్యలపై కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలని ఎస్పీ సూచించారు.
వేరుశనగ క్వింటా రూ.6,389
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు సోమవారం 366 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.6389, కనిష్టం రూ. 3066, సరాసరి రూ.4431 ధరలు లభించాయి.
పాఠశాలను సందర్శించిన యూనిసెఫ్ బృందం
ధరూరు: మండలంలోని ఉప్పేర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం యూనిసెఫ్ బృందం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించడంతోపాటు మరుగుదొడ్లు, మూత్రశాలలు ఎలా ఉన్నాయని బాలికలను అడిగి తెలుసుకున్నారు. మద్యాహ్న భోజనం సమయంలో విద్యార్ధులు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఆర్‌ఓ ప్లాంట్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం గౌరిశంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వచ్చేనెల 3న
సీఎం రేవంత్‌రెడ్డి రాక
అడ్డాకుల: వచ్చే నెల 3న మూసాపేటకు సీఎం రేవంత్‌రెడ్డి రానున్నారు. మూసాపేటలో నిర్మాణాలు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు హాజరు కానున్నారు. ఇందులో భాగంగా సోమవారం దేవరకద్రలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి మూసాపేట గ్రామస్తులతో సమావేశమయ్యారు. మూసాపేటలో చివరి దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని లబ్ధిదారులకు సూచించారు. వచ్చేనెల ప్రారంభం నాటికి ఇళ్ల పనులను పూర్తి చేస్తే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని ఎమ్మెల్యే తెలిపారు.

‘ప్రజావాణి’ ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి