
గుండె పగిలిపోయి..
ఒక్కొక్కరుగా ‘పాలమూరు–రంగారెడ్డి’ నిర్వాసితుల మృత్యువాత
చనిపోయిన తన భర్త పస్పుల శేఖర్ ఫొటోను చూపిస్తున్న మహిళ పేరు పార్వతమ్మ. వనపర్తి జిల్లా రేవల్లి మండలం బండరాయిపాకుల గ్రామానికి చెందిన ఆ దంపతులకు ముగ్గురు సంతానం. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో భాగమైన ఏదుల రిజర్వాయర్ నిర్మాణంలో వీరికి ఉన్న ఎకరం భూమి ముంపునకు గురైంది. ఎకరాకు రూ.3.50 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం అందించింది. రూ.2 చొప్పున వడ్డీ ఇస్తామని నమ్మబలకడంతో శేఖర్ రూ.2 లక్షలను ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్ కంపెనీలో జమచేశాడు. ఆరునెలల్లో డబ్బులు తిరిగిస్తామని పత్రం రాసివ్వగా, మూడేళ్లు గడిచినా డబ్బులు ఇవ్వలేదు. పైసలు రావడం లేదన్న బెంగతో 2023 ఆగస్టు 26న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పునరావాసం కింద నిర్మించుకుంటున్న ఇల్లు సైతం డబ్బులు లేక అసంపూర్తిగానే ఉండగా.. పిల్లలను ఎలా పోషించాలో తెలియడం లేదని భార్య పార్వతమ్మ వాపోతోంది.