
ఇంటింటా వెల్లివిరిసిన ఆత్మీయ బంధం
● ఘనంగా రాఖీ వేడుకలు
గద్వాలటౌన్: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలచిన రాఖీ పౌర్ణమిని శనివారం జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. సోదరీమణులు తమ సోదరులకు నుదుట కుంకుమ పెట్టి రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. దూర ప్రాంతాల నుంచి సైతం వచ్చి మహిళలు తమ సోదరులకు రాఖీలు కట్టారు. కొందరు మహిళలు కొరియర్, పోస్టల్ ద్వారా తమ సోదరులకు రాఖీలు పంపారు. ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. నేను నీకు రక్షా.. నీవు నాకు రక్షా.. మనిద్దరం దేశానికి రక్షా అంటూ రాఖీ వేడుకలు చేపట్టారు. ప్రజాపిత బ్రహ్మకుమారీలు పలువురు రాజకీయ నాయకుల ఇళ్లకు వెళ్లి రాఖీలు కట్టారు. జిల్లాలో వివిధ పార్టీల నాయకులు రాఖీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి పలువురు మహిళలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
శనేశ్వరుడికి
తైలాభిషేకాలు
బిజినేపల్లి: నందివడ్డెమాన్ జైష్ఠ్యాదేవి సమేత శనేశ్వరుడికి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు శనేశ్వరాలయాన్ని సందర్శించి తమ ఏలినాటి శనిదోష నివారణ కోసం స్వామివారికి తిల తైలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మసూత్ర పరమశివుడిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ చైర్మన్ గోపాల్‌రావు, ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి, కమిటీ సభ్యులు రాజేశ్, ప్రభాకరాచారి, పుల్లయ్య, వీరశేఖర్, అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య పాల్గొన్నారు.
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించండి
కందనూలు: అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సదానందంగౌడ్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవనంలో జిల్లా అధ్యక్షుడు మురళి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. పదోన్నతులతో పాటు బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని కోరారు. 317 జీఓ బాధితుల సమస్యలను పరిష్కరించడంతో పాటు అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేయాలన్నారు. హెల్త్ కార్డులు అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలయ్యే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. మధ్యాహ్న భోజన బిల్లులు ప్రతినెలా క్రమం తప్పకుండా విడుదల చేయాలని కోరారు. సమావేశంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌రావు, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఈశ్వర్, కార్యదర్శి రమేశ్, ఉపాధ్యక్షుడు లక్ష్మణరావు, జిల్లా మాజీ అధ్యక్షుడు సుదర్శన్ ఉన్నారు.

ఇంటింటా వెల్లివిరిసిన ఆత్మీయ బంధం

ఇంటింటా వెల్లివిరిసిన ఆత్మీయ బంధం