
భక్తిశ్రద్ధలతో నూలు పౌర్ణమి వేడుకలు
గద్వాలటౌన్: పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని భక్త మార్కండేయస్వామి ఆలయంలో రాఖీ పౌర్ణమి, నూలు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం 7గంటల నుంచి పలు పూజా కార్యక్రమాలు చేపట్టారు. గణపతి హోమం, యజ్ఞోపహితధారణ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. అనంతరం వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికీ రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. పద్మశాలీలు జంద్యం ధరించారు. అనంతరం రథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా చేపట్టారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నాయకులు అఖండ భజన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు పులిపాటి వెంకటేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.