
కనులపండువగా కల్యాణోత్సవం
మల్దకల్ : ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం స్వామి వారి కల్యాణోత్సవం కనులపండువగా జరిగింది. ఆలయంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా వేదపండితులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారి ఉత్సవమూర్తులకు కల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
స్వామి వారి రథోత్సవం
ప్రతి ఏటా రాఖీపౌర్ణమి రోజున స్వామి వారి ఆలయంలో రథోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగానే రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు అరవిందరావు, బాబురావు, చంద్రశేఖర్‌రావు, అర్చకులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి, దామరామక్రిష్ణ, దామ భీమరాయుడు, దామగోవిందప్ప, దామమురళీఽ, దామ లక్ష్మీనారాయణ, భక్తులు, వాల్మీకి పూజారులు తిరుమల్, గోవిందు, దాతలు దామ శంకరయ్య పార్వతమ్మ పాల్గొన్నారు.

కనులపండువగా కల్యాణోత్సవం