
దంచికొట్టిన వాన
జిల్లాలోని పలు మండలాల్లో శుక్ర, శనివారం వాన దంచికొట్టింది. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత జిల్లాలో ఇంతటి భారీ వర్షం కురవడం ఇదే తొలిసారి. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా పెద్దగా వానలు లేక రైతులు ఇబ్బంది పడుతూ వచ్చారు. జిల్లాలో ఇప్పటికే దాదాపు 1.2 లక్షల ఎకరాల్లో పంటలు వేసినా.. వరుణుడి జాడ మాత్రం కరువైంది. చేసేది లేక వర్షాల కోసం పలు గ్రామాల్లో పూజలు సైతం చేశారు. ఎట్టకేలకు వరుణుడు కరుణించడంతో ఎండుదశకు చేరిన పంటలకు ఊపిరిపోసినట్లయ్యింది. ఇదిలాఉండగా, శనివారం ప్రధానంగా అలంపూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురవడంతో పంట పొలాలు నీటమునిగాయి. అలంపూర్, అయిజ, శాంతినగర్, ఉండవెల్లి, గట్టు, ఇతర
మండలాల్లో వాగులు వంకలు పొంగి పొర్లాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. – సాక్షి నెట్‌వర్క్

దంచికొట్టిన వాన

దంచికొట్టిన వాన