కార్మిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
అలంపూర్: కార్మికులు కార్మిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మిథున్‌తేజ అన్నారు. శుక్రవారం అలంపూర్‌లోని జూనియర్ సివిల్ కోర్టులో మండల న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జడ్జి మిథున్ తేజ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మేడేను పురస్కరించుకొని కార్మిక చట్టాలపై అవగాహన కల్పించారు. కార్మికుల కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, ఆ చట్టాలతో తమను తాము రక్షించుకోవచ్చని, చట్టాలతో న్యాయం పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్మికులకు ఉన్న హక్కులు, చట్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గవ్వల శ్రీనివాసులు, ఏజీపీ మధు, సీనియర్ న్యాయవాదులు నారయణ రెడ్డి, ఈదుర్ బాష, యాకోబ్, ఆంజనేయులు, వెంకటేష్ తదితరులు ఉన్నారు.


