అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
అలంపూర్: అగ్ని ప్రమాదాల నివారణకు అప్రమత్తంగా ఉండటమే పరిష్కారమని అలంపూర్ ఫైర్‌స్టేషన్ ఇన్‌చార్జ్ కురుమూర్తి అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని ఫైర్ స్టేషన్‌లో అగ్ని మాపక వారోత్సవాలను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ధ్వర్యంలో ఫైర్ సిబ్బంది 1944లో విక్టోరియాలో జరిగిన నౌకా ప్రమాదంలో మృతి చెందిన ఫైర్‌స్టేషన్ సిబ్బందికి నివాళులు అర్పించి మౌనం పాటించారు. వారోత్సవాల్లో భాగంగా తొలి రోజు అగ్ని ప్రమాదాల నివారణలో వినియోగించే సామగ్రితో స్టాల్స్ నిర్వహించారు. స్టాల్స్ సందర్శనకు విచ్చేసిన ప్రజలకు వాటి వినియోగం గురించి వివరించారు. అగ్ని ప్రమాదాలు సంభవించిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిబ్బంది రవిప్రకాష్, రవీందర్, నవీన్ గౌడు, అమరనాథ్, వినీత్ కుమార్ రెడ్డి, సాయికుమార్, జగదీశ్వర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.


