శాంతినగర్: తుంగభద్ర డ్యాం నుంచి ఈనెల 12న నాలుగో ఇండెంట్ పెట్టేందుకు నీటి పారుదలశాఖ అధికారులు (ఈఎన్‌సీ) నిర్ణయం తీసుకున్నట్లు ఆర్డీఎస్ ఈఈ విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆర్డీఎస్ వాటాగా 2024–25లో 5.896 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం (టీబీ డ్యాం ద్వారా) ఒప్పందం చేసుకుందన్నారు. అందులో భాగంగా మొదటి ఇండెంట్ గతేడాది డిసెంబర్ 26న 1.078 టీంఎంసీలు, రెండో ఇండెంట్ జనవరి 8న 1.04 టీఎంసీలు, మూడో ఇండెంట్ జనవరి 23న 1.555 టీంఎసీలు పెట్టినట్లు ఈఈ వివరించారు. నాలుగో ఇండెంట్ 1.166 టీఎంసీ ఈనెల 12 నుంచి 22 వరకు 11 రోజుల పాటు మొదటి 5 రోజులు రోజుకు 1500 క్యూసెక్కుల చొప్పున, మిగతా ఆరు రోజులు రోజుకు 1000 క్యూసెక్కుల చొప్పున టీబీ డ్యాం నుంచి నీటిని విడుదల చేస్తారని, రైతులు సాగునీటి కొరకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. చివరి ఇండెంట్ 1 టీఎంసీ వుంటుందని, పంటలకు అవసరమని రైతులు ఎప్పుడు కోరితే అప్పుడు ఐదో ఇండెంట్ పెడతామని ఈఈ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment