పోటీలో లేని గద్వాల జేజమ్మ

- - Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌: దశాబ్దాల పాటు రాజకీయ అనుభవం ఉన్న ఉమ్మడి పాలమూరులోని సీనియర్‌ రాజకీయ నేతలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. సుమారు 35 నుంచి 40 ఏళ్ల పాటు ఎన్నికల పోరులో తలపడుతూ వచ్చిన పలువురు రాజకీయ ఉద్దండులు అనూహ్యంగా ఎన్నికల్లో పోటీ నుంచి నిష్క్రమించడం గమనార్హం. మారిన పరిస్థితులకు అనుగుణంగా వీరంతా ఎన్నికల్లో పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులకు మద్దతుగా ఉంటూ ప్రచారం సాగిస్తున్నారు.

గద్వాల ఫైర్‌బ్రాండ్‌ డీకే అరుణ 
ద్వాల ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన డీకే అరుణ ఈసారి ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా 1999లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోగా.. సమజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా 2004 ఎన్నికల్లో బరిలో నిలిచి గెలుపొందారు. అనంతరం 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కాగా, అనంతరం బీజేపీలో చేరారు. ఆపార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలుగా కొ నసాగుతున్నారు. అయితే అ నూహ్యంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆమె దూ రంగా ఉన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఇ ప్పుడు బరి నుంచి తప్పుకున్నట్లు ప్రచారం సాగుతోంది.

చివరి నిమిషంలో జిల్లెల చిన్నారెడ్డి
ఐసీసీ కార్యదర్శిగా కొనసాగుతున్న జిల్లెల చిన్నారెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారు. వనపర్తి నియోజకవర్గం నుంచి 1989, 1999, 2004, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో సైతం ఆయనకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ప్రకటించినా చివరి నిమిషంలో అభ్యర్థిత్వంలో మార్పు చేసింది. ఆయన స్థానంలో మరో నేత మేఘారెడ్డికి టికెట్‌ ఖరారు చేసింది. దీంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల బరి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడు, నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో వెలుగొందిన నేతలు ప్రస్తుత ఎన్నికల్లో అనూహ్యంగా బరి నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.

కందనూలు పోరుకు నాగం వీడ్కోలు..
నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో 1983 నుంచి సుమారు 40 ఏళ్లుగా ఎన్నికల బరిలో నిలుస్తూ వచ్చిన మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఈసారి పోటీ నుంచి తప్పుకున్నారు. 1983లో వైద్యరంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాగం కందనూలుతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ముద్ర వేశారు. టీడీపీ అభ్యర్థిగా 1985, 1994, 1999, 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. 2012 ఉపఎన్నికలోనూ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఈ క్రమంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా సేవలందించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఆశించిన ఆయనకు భంగపాటు తప్పలేదు.

ఈ అనూహ్య పరిణామానికి కలత చెందిన నాగం కాంగ్రెస్‌ను వీడి, బీఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. కొల్లాపూర్‌లో మరో కాంగ్రెస్‌ నేత చింతలపల్లి జగదీశ్వరరావు ఈసారి ఎన్నికల బరి నుంచి వైదొలిగారు. 2009లో టీడీపీ నుంచి బరిలో ఉన్న ఆయన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి జూపల్లి కృష్ణారావుపై 1508 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు. అనంతరం 2012 ఉప ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించగా, జూపల్లి కృష్ణారావుకు టికెట్‌ కేటాయించడంతో జగదీశ్వరరావు పోటీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

Read latest Jogulamba News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

18-11-2023
Nov 18, 2023, 10:53 IST
మెదక్‌: కాంగ్రెస్‌ అభ్యర్థి రోహిత్‌రావు మాటలకు అర్థాలే వేరులే.. అనే విధంగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. తాను గెలిస్తే రోజుకు...
18-11-2023
Nov 18, 2023, 09:43 IST
సాక్షి, కరీంనగర్‌: నేను అవినీతిపరుడినట.. నా దగ్గర డబ్బు సంచులున్నయట.. అందుకే అధ్యక్ష పదవి నుంచి నన్ను తీసేశారట.. నేనేమన్నా ఆయన...
18-11-2023
Nov 18, 2023, 09:11 IST
సాక్షి,  కరీంనగర్/పెద్దపల్లి: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా అన్ని పార్టీల్లో ఫిరాయింపులు జోరుగా సాగుతున్నాయి. దీంతో కొత్తగా వచ్చిచేరిన నేతలు లేదా...
18-11-2023
Nov 18, 2023, 08:27 IST
సాక్షి, ఆదిలాబాద్‌: ‘నా తమ్ముడు జాన్సన్‌నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఖానాపూర్‌ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా’నని బీఆర్‌ఎస్‌ పార్టీ...
18-11-2023
Nov 18, 2023, 08:05 IST
సాక్షి, ఆదిలాబాద్‌/మంచిర్యాల: వారంతా విద్యాధికులే.. ఉన్నత లక్ష్యంతో డిగ్రీ, పీజీ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసినవారే. వివిధ వృత్తులు, వ్యాపారాలు చేస్తూనే ప్రజాసేవ...
18-11-2023
Nov 18, 2023, 07:48 IST
సంగారెడ్డి(గజ్వేల్‌): కాంగ్రెస్‌కు ఓటేస్తే 3 గంటల కరంటే ఉంటుందని వైద్యారోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. కుకునూరుపల్లి మండల...
18-11-2023
Nov 18, 2023, 07:36 IST
హైదరాబాద్: శాసనసభలో అడుగు పెట్టాలని ఎన్నికలలో పోటీ చేసే ప్రతీ రాజకీయ నాయకుడి కల. గెలిచిన అభ్యర్థులకేమో ప్రభుత్వం ఏర్పాటయ్యాక...
18-11-2023
Nov 18, 2023, 06:40 IST
మెదక్‌/గజ్వేల్‌: బీజేపీ నేత ఈటలకు రాజకీయ భిక్ష పెట్టింది సీఎం కేసీఆరేనని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల కోసం ఆపద...
18-11-2023
Nov 18, 2023, 06:38 IST
సాక్షి, మెదక్‌: సీఎం కేసీఆర్‌ మోసపూరిత హామీలను నర్సాపూర్‌ నియోజకవర్గ ప్రజలు నమ్మరని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి అన్నారు....
18-11-2023
Nov 18, 2023, 04:50 IST
సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలో మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతిపై (యూనిఫాం సివిల్‌ కోడ్‌) నిర్ణయం తీసుకుంటుందని...
18-11-2023
Nov 18, 2023, 03:23 IST
సాక్షి, వరంగల్‌/ వరంగల్‌/ నర్సంపేట/ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రమిస్తే.....
18-11-2023
Nov 18, 2023, 01:36 IST
సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ శుక్రవారం కరీంనగర్‌, చొప్పదండి, హుజూరాబాద్‌ నియోజకవర్గాల ప్రజాఆశీర్వాద...
18-11-2023
Nov 18, 2023, 01:20 IST
సాక్షి, వరంగల్‌: వరంగల్‌ తూర్పు బీఆర్‌ఎస్‌ రోజురోజుకూ ఖాళీ అవుతోంది. ఒకరి తర్వాత ఒకరు ముఖ్య నేతలు గులాబీ పార్టీకి...
18-11-2023
Nov 18, 2023, 01:20 IST
సాక్షిప్రతినిధి, వరంగల్‌: కారు ప్రచారం జోరందుకుంది. శుక్రవారం పరకాలలో ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి గెలుపు కోసం నిర్వహించిన...
17-11-2023
Nov 17, 2023, 20:18 IST
‍సాక్షి, హైదరాబాద్‌ : విరాట్  కోహ్లీ సెంచరీ కొట్టినట్టు బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో సెంచరీ కొట్టాలని  బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌,...
17-11-2023
Nov 17, 2023, 17:12 IST
సాక్షి,వరంగల్‌ : తెలంగాణ ఇస్తే పేదలకు మంచి జరుగుతుందని భావించామని, అయితే వారికి ఎలాంటి మేలు జరగలేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ...
17-11-2023
Nov 17, 2023, 15:20 IST
సాక్షి, కరీంనగర్‌: కాంగ్రెస్‌ మోసకారి పార్టీ అని, ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఇక్కడి ప్రజలను 60 ఏండ్లు గోస పెట్టిన పార్టీ...
17-11-2023
Nov 17, 2023, 13:07 IST
ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరగాలంటే రాష్ట్ర పోలీసులతో పాటు సాయుధ దళాల బందోబస్తు కూడా ఎంతో ముఖ్యం. ఆ...
17-11-2023
Nov 17, 2023, 12:48 IST
ఆరు గ్యారెంటీల్ని కలిపేసుకుని 37 ప్రధానాంశాలతో.. అనుబంధ మేనిఫెస్టో పేరిట జాబ్‌క్యాలెండర్‌లో మరో 13 అంశాల్ని చేర్చి..
17-11-2023
Nov 17, 2023, 12:27 IST
హనమకొండ: ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత ప్రధానమైనది. ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఎన్నికల్లో పౌరుడు తన... 

Read also in:
Back to Top