ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడి | Sakshi
Sakshi News home page

ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడి

Published Fri, Nov 17 2023 1:24 AM

- - Sakshi

శాంతినగర్‌: వ్యవసాయరంగంలో ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఉపయోగించి అధిక దిగుబడులు సాధించాలని కృషివిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు దాదాసాహెబ్‌ ఖోగరే, డాక్టర్‌ భవానిలు అన్నారు. వడ్డేపల్లి ఐకేపీ సమావేశ మందిరంలో ఎంపీడీఓ రవీంద్ర అధ్యక్షతన గురువారం ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా రైతులకు, ఉపాధి కూలీలకు వ్యవసాయంలో మెలకువలు, పంటలకు సోకే తెగుళ్లు, ఎరువుల వాడకం గురించి వివరించారు. మట్టి సాంద్రత, ఏ రకం మట్టిలో ఎలాంటి పంటలు సాగుచేయాలి, ఎలా పండించాలనే విషయాలపై అవగాహన కల్పించారు. శాస్త్రవేత్త డా.భవాని వర్మీ కంపోస్టు తయారీపై శిక్షణ ఇచ్చారు.

ఉపాధి కూలీలకు శిక్షణ..

ఉపాధి పనుల్లో వంద రోజులు పూర్తిచేసిన కూలీలకు గురువారం శిక్షణ తరగతులు ప్రారంభించారు. అనంతరం ఎంపీడీఓ రవీంద్ర మాట్లాడుతూ డీఆర్‌డీఓ ఆదేశాల మేరకు ఉపాధి కూలీలకు ఈనెల 16 నుంచి డిసెంబర్‌ 2 వరకు 15 రోజులపాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణ కార్యక్రమంలో వడ్డేపల్లి, రాజోళి మండలాలకు చెందిన 100 మంది కూలీలు పాల్గొంటారన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ, మేలు రకం వంగడాల సాగు, ఆధునిక పద్ధతులపై శిక్షణ వుంటుందని, ఉమ్మడి మండలాలకు చెందిన 100 మంది తప్పక హాజరుకావాలని ఎంపీడీఓ సూచించారు. సమావేశంలో రాజోళి ఎంపీడీఓ గోవిందరావు, నోడల్‌ ఆఫీసర్‌ శ్రీనివాసులు, కోఆర్డినేటర్‌ మహేష్‌, ఏపీఓలు విజయలలిత, సౌజన్య, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కృషివిజ్ఞాన 
కేంద్రం శాస్త్రవేత్త దాదాసాహెబ్‌ ఖోగరే
1/1

మాట్లాడుతున్న కృషివిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త దాదాసాహెబ్‌ ఖోగరే

Advertisement
 
Advertisement