యాసంగి సాగుకు కోత | - | Sakshi
Sakshi News home page

యాసంగి సాగుకు కోత

Nov 26 2026 1:17 AM | Updated on Nov 26 2026 1:17 AM

ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలి

కాళేశ్వరం: యాసంగి సాగుకు వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. రైతులకు సూచనలు అందిస్తూ, పంటల సాగును ప్రణాళికాబద్ధంగా చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ యాసంగి సీజన్‌లో 63,863 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో వరి 37,630 ఎకరాలు, మొక్కజొన్న 22,475 ఎకరాల్లో సాగు చేయాలని ప్రణాళిక రూపొందించారు. గతేడాదితో పోలిస్తే ఎన్‌నినో ప్రభావంతో ఈసారి వరి సాగు విస్తీర్ణాన్ని భారీగా తగ్గించి, ప్రత్యామ్నాయ పంటల సాగును పెంచడంపై వ్యవసాయశాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఈ ఖరీఫ్‌లో జిల్లాలో మొత్తం 1.11 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. గతేడాది యాసంగిలో వరి పంట లక్ష ఎకరాల్లో సాగు చేశారు.

వరి సాగుపై నియంత్రణ..

వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, సాగునీటి వనరుల లభ్యతను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాఖ పంటల ప్రణాళిక రూపొందించింది. నీటి వినియోగం అధికంగా ఉండే వరి సాగును సాధ్యమైనంత మేరకు తగ్గించి, తక్కువ నీటితో పండే పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. భూగర్భ జలాల పరిస్థితులను అంచనా వేసి రైతులు పంటల ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం

రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా పంటల మార్పిడి విధానాన్ని అనుసరించాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. పెసర, మినుము, శనగ, జొన్న, నువ్వులు తదితర ఆరుతడి పంటలతో పాటు ఉద్యాన పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి అవసరంతో మంచి దిగుబడులు సాధించే పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా రైతులకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఎల్‌నినో ప్రభావంతో

పంటలపై ప్రభావం

వర్షాభావంతో పంటల విస్తీర్ణానికి భారీ కోత

ఆరుతడి, ఉద్యాన పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారిస్తే మేలు

రానున్న రోజుల్లో నీటి కష్టాలతో

పంటలకు ముప్పు

నీటి లభ్యతే కీలకం..

ఈ యాసంగి సాగులో సాగునీటి లభ్యత కీలకంగా మారనుంది. బోరుబావులు, చెరువులు, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఇప్పటికే దిగువకు చేరుతున్నాయి. వాటిని ముందుగానే అంచనా వేసుకొని పంటలు సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. నీటి వనరులు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్నారు. రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు పాటిస్తూ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఎన్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో బోర్లు, బావులు, చెరువులు వట్టిపోయే ప్రమాదం ఉందని ఇప్పటికే గణాంకాలు చెబుతున్నాయి. తీవ్రత పెరిగితే రైతులు నష్టపోతారు. అందుకే ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి. తక్కువ నీటితో పండే పంటలపై రైతులు ఫోకస్‌ చేయాలి. పెట్టుబడులు పెట్టి నష్టపోవొద్దు. ఇప్పటికే జిల్లాలో ప్రభుత్వం ఆదేశాలతో పంటలపై యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం చేశాం. రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.

– జాడి బాబురావు,

జిల్లా వ్యవసాయశాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement