గోవిందా.. గోవిందా | - | Sakshi
Sakshi News home page

గోవిందా.. గోవిందా

Nov 26 2026 1:17 AM | Updated on Nov 26 2026 1:17 AM

రేగొండ: గోవింద నామస్మరణతో బుగులోని గుట్ట రెండో రోజు మారుమోగింది. రేగొండ మండలం తిరుమలగిరి శివారులోని బుగులోని వేంకటేశ్వరస్వామి జాతర బుధవారం కూడా భక్తులతో కోలాహలంగా మారింది. వేలాది మంది రావడంతో జాతర ఆవరణమంతా భక్తిభావంతో ఉప్పొంగింది. గుట్టపై కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పౌర్ణమి వెలుగుల్లో స్వామి వారి దర్శనానికి భక్తులు రాత్రి, పగలు తేడా లేకుండా బారులుదీరారు. కోరిన కోర్కెలు తీర్చాలని తలనీలాలు సమర్పించారు. గండ దీపంలో నూనె పోసి దీపారాధన చేశారు. జాతరకు వచ్చిన భక్తులు ముందుగా ఇప్పచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి జాతర ప్రాంగణంలో విడిది చేశారు. జాతర ప్రాంగణంలో ఉన్న కోనేరులో స్నానాలు ఆచరించి గుట్ట కింద ఉన్న శివాలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. గుట్ట కింద ఉన్న స్వామి వారి పాదాలకు ప్రత్యేక పూజలు చేశారు. జిల్లానుంచే కాకుండా ములుగు, హుజురాబాద్‌, వరంగల్‌, మంథని, కరీంనగర్‌, హైదరాబాద్‌ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు సమర్పించారు. బుధవారం సుమారు 20వేల మంది భక్తులు జాతరకు వచ్చినట్లు ఈఓ బిల్లా శ్రీనివాస్‌ తెలిపారు. సీఐ కరుణాకర్‌ రావు, ఎస్సై సుధాకర్‌ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఎప్పటికప్పుడు బందోబస్తు చర్యలు పర్యవేక్షించారు.

మొక్కులు చెల్లించుకున్న ప్రముఖులు..

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్‌ రాహుల్‌శర్మ శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రేగొండ పీహెచ్‌సీ వైద్యాధికారి హిమబిందు ఆధ్వర్యంలో జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని జిల్లా వైద్యాధికారి మధుసూదన్‌ పరిశీలించారు.

బుగులోని జాతరకు

పోటెత్తిన భక్తజనం

మార్మోగిన గోవింద నామస్మరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement