అర్హులందరికీ సంక్షేమ ఫలాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

Nov 26 2026 1:17 AM | Updated on Nov 26 2026 1:17 AM

మల్హర్‌(కాటారం)/కాళేశ్వరం: అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. బుధవారం మహదేవపూర్‌లో తహసీల్దార్‌ కార్యాలయం, అగ్నిమాపక కేంద్రం ప్రారంభం, కాటారం మండలకేంద్రంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. తహసీల్దార్‌ సత్యనారాయణ స్వామిని ఆయన కుర్చీలో ఆసీనులను చేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ మహదేవపూర్‌తో పాటు పలిమెల, మహాముత్తారం, కాటారం, మల్హర్‌ మండలాల ప్రజలకు సత్వర అగ్నిమాపక సేవలు అందించేందుకు ఫైర్‌స్టేషన్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రమాద సమయాల్లో తక్షణమే స్పందించి ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడమే లక్ష్యమన్నారు. త్వరలో ఆధునిక సాంకేతిక సదుపాయాలు, పూర్తిస్థాయి సిబ్బందితో ఫైర్‌ స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న తహసీల్దార్‌ భవన నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. అర్హత ఉండి పింఛన్‌ రానివారు ఎంపీడీఓలను సంప్రదిస్తే మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. రాజకీయ ఒత్తిళ్లు, సిఫార్సులకు తావివ్వకుండా అర్హత ఆధారంగానే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. యువతకు ఉపాధి కల్పించేందుకు అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌, వస్త్ర పరిశ్రమ పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రి తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువత కోసం సంక్రాంతి తర్వాత కాటారం, మహదేవపూర్‌, మహాముత్తారం, మల్హర్‌ మండలాల్లో రూ.50 లక్షల చొప్పున, పలిమెలలో రూ.20 లక్షలతో ఆధునిక గ్రంథాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. చిన్న కాళేశ్వరం, మేడిగడ్డ పునరుద్ధరణతో పాటు భూసేకరణ పరిహారం అందని రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌, కాటారం సబ్‌ కలెక్టర్‌ సౌరబ్‌శర్మ, అదనపు కలెక్టర్‌ అశోక్‌ కుమార్‌, డీఆర్‌ఓ వసంతకుమారి, జిల్లా అగ్నిమాపక అధికారులు నాగరాజు, శ్రీనివాస్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజబాబు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పంతగాని తిరుమల, డీఆర్డీఓ బాలకష్ణ, ఉపాధి హామీ రాష్ట్ర సభ్యులు దండు రమేష్‌, మార్కె ట్‌ కమిటీ చైర్మన్‌ పంతగాని తిరుమల, పీఏసీఎస్‌ చైర్మన్‌ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

త్వరలో ఆధునిక ఫైర్‌స్టేషన్‌ ఏర్పాటు

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మహదేవపూర్‌ తహసీల్దార్‌

కార్యాలయం, ఫైర్‌స్టేషన్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement