నాణ్యమైన భోజనం అందించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన భోజనం అందించాలి

Nov 26 2026 1:17 AM | Updated on Nov 26 2026 1:17 AM

మహాముత్తారం: పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందించాలని భూపాలపల్లి ఏటీడబ్లూఓ శివకృష్ణ అన్నారు. బుధవారం మండలంలోని మాదారం, పెగడపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పాఠశాలల్లో రికార్డులను పరిశీలించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలలోని విద్యార్థులందరికీ వంద శాతం బ్యాంక్‌ ఖాతాలు తెరిపించేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గొత్తికోయ విద్యార్థులకు ఆధార్‌కార్డులు లేకపోవడాన్ని గుర్తించిన ఆయన పాఠశాలలో ప్రత్యేక ఆధార్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వరూప, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

భూపాలపల్లి రూరల్‌: వివిధ రంగాల్లో కనీసం 25 సంవత్సరాలు సేవలందించిన క్రైస్తవ స్వచ్ఛంద, విద్య, వైద్య సంస్థలను, 10 సంవత్సరాల సేవలందించిన ప్రముఖులను రాష్ట్ర స్థాయి క్రిస్మస్‌ వేడుకల్లో ప్రభుత్వం పురస్కారాలు అందిస్తుందని, అర్హత కలిగిన సంస్థలు, ప్రముఖులు డిసెంబర్‌ 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కుమారస్వామి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రముఖులకు రూ.లక్ష, సంస్థలకు రూ.2లక్షలు పారితోషికంతో పాటు జ్ఞాపికలను అందించనున్నట్లు తెలిపారు. వివరాలకు 040–23391067 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

ఘనంగా ఏఎమ్మార్‌ వార్షికోత్సవం

మల్హర్‌: తాడిచర్ల ఏఎమ్మార్‌ కంపెనీ ఆవరణలో బుధవారం 9వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వైస్‌ ప్రెసిడెంట్లు ప్రభాకర్‌రెడ్డి, కేఎస్‌ఎన్‌ మూర్తి మాట్లాడుతూ.. విధుల్లో ప్రతీ ఒక్కరు భద్రత పాటించాలని, జాగ్రత్తగా పనులు చేయాలని సూచించారు. ప్రతీ ఒక్కరు క్రమశిక్షణతో, సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సేఫ్టీ ఆఫీసర్‌ సురేష్‌బాబు, హెచ్‌ఆర్‌డీజీఎం రమేశ్‌బాబు, అధిక సంఖ్యలో ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.

సామాజిక సేవకు

జాతీయ పురస్కారం

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాకు చెందిన సామాజిక సేవకుడు, మోటివేషనల్‌ స్పీకర్‌ జేసీ డాక్టర్‌ రాజు అరుముళ్లకు నేషనల్‌ సోషల్‌ ఇంపాక్ట్‌ అవార్డు–2026 లభించింది. నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ ఫోరం ఆఫ్‌ ఆర్టిస్ట్‌ అండ్‌ యాక్టివిస్ట్‌(ఎన్‌ఐఎఫ్‌ఏఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సంవేదనా–2’ జాతీయ రక్తదాన అవగాహన కార్యక్రమంలో భాగంగా రక్తదానం, అవయవదానం తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నందుకు ఈ పురస్కారాన్ని అందజేశారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు అవార్డును అందజేశారు. జాతీయస్థాయిలో గుర్తింపు లభించడంపై జిల్లావాసులు, పలువురు సామాజిక సేవకులు ఆయనకు అభినందనలు తెలిపారు.

ఆధార్‌ అప్‌డేట్‌లో

జాగ్రత్తలు అవసరం

వాజేడు: ఆధార్‌ అప్‌డేట్‌లో పొరపాట్లకు తావివ్వకుండా విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించాలని ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో సూచించారు. మండల పరిధిలోని పెద్దగొల్లగూడెం బాలికల ఆశ్రమ పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనశాలను పరిశీలించడంతో పాటు పలు అంశాలపై ఆరా తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement