డ్రాఫ్ట్‌ జాబితా విడుదల | - | Sakshi
Sakshi News home page

డ్రాఫ్ట్‌ జాబితా విడుదల

Nov 26 2026 1:17 AM | Updated on Nov 26 2026 1:17 AM

డ్రాఫ్ట్‌ జాబితా విడుదల

సాక్షిప్రతినిధి, వరంగల్‌: వచ్చే ఏడాది నిర్వహించనున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓటర్ల జాబితా తయారీలో కీలక అడుగు పడింది. వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ గ్రాడ్యుయేట్స్‌ నియోజకవర్గంతో పాటు మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ గ్రాడ్యుయేట్స్‌ నియోజకవర్గాలకు బుధవారం డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేశారు. 2026 నవంబర్‌ 1 అర్హత తేదీగా తీసుకుని రూపొందించిన ఈ జాబితాలో ఉమ్మడి వరంగల్‌ పరిధి ఆరు జిల్లాల నుంచి 2,14,672 దరఖాస్తులు అర్హత పొందాయి. మరో 20,627 దరఖాస్తులను అనర్హమైనవిగా గుర్తించారు. ఉమ్మడి వరంగల్‌ పరిధిలో అత్యధిక గ్రాడ్యుయేట్‌ ఓటర్లు హనుమకొండ జిల్లాలో నమోదయ్యారు.

మహిళా ఓటర్లూ గణనీయమే..

డ్రాఫ్ట్‌ జాబితాలో పురుషులు, మహిళలు, థర్డ్‌ జెండర్‌ ఓటర్ల వివరాలను కూడా ఎన్నికల అధికారులు వెల్లడించారు. డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితాలపై నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 10 వరకు క్లెయిమ్స్‌, అభ్యంతరాలు స్వీకరించనున్నారు. గత ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేరున్నప్పటికీ ఈసారి వాటిని ఆటోమేటిక్‌గా కొనసాగించలేదు. అర్హత ఉన్న గ్రాడ్యుయేట్లు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఇలా..

ఉమ్మడి వరంగల్‌ పరిధిలో

2.14 లక్షల గ్రాడ్యుయేట్‌ ఓటర్లు

డిసెంబర్‌ 10 వరకు

అభ్యంతరాలకు అవకాశం

జిల్లా పురుషులు మహిళలు థర్డ్‌ మొత్తం

జెండర్‌

జనగామ 20,013 12,894 1 32,908

మహబూబాబాద్‌ 31,385 18,182 0 49,567

వరంగల్‌ 37,746 4,799 1 62,546

హనుమకొండ 36,105 27,001 1 63,107

భూపాలపల్లి 9,970 6,370 0 16,340

ములుగు 8,896 5,308 0 14,204

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement