ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త | - | Sakshi
Sakshi News home page

ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త

Nov 14 2026 1:23 AM | Updated on Nov 14 2026 1:23 AM

ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త

హన్మకొండ: ప్రయాణికులను ఆకట్టుకునేందుకు టీజీఎస్‌ ఆర్టీసీ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. రోజువారీ ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు మంత్లీ సీజన్‌ టికెట్‌ను ప్రవేశపెట్టింది. రూట్‌ దూరాన్ని బట్టి మంత్లీ టికెట్‌ ధర ఉంటుంది. ఈ టికెట్‌ తీసుకున్న వారు అదే రూట్‌లో కాకుండా ఇతర రూట్లలో 10శాతం రాయితీతో సూపర్‌ లగ్జరీ, ఆ పైబడిన సర్వీస్‌ల్లో ప్రయాణించే అవకాశం కల్పించింది. ఆదివారం కూడా హైదరాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌, నల్లగొండ, కరీంనగర్‌ నగరాల్లోని అన్ని సిటీ బస్సుల్లో (పుష్పక్‌ ఏయిర్‌ ఫోల్ట్‌ మినహా) ప్రయాణించవచ్చు. ఇప్పటివరకు ఉన్న దూర పరిమితిని సంస్థ పూర్తిగా తొలగించింది. ధరల భారం మరింత తగ్గించే క్రమంలో టోల్‌చార్జీలు 25 రోజుల నుంచి 20 రోజులకు కుదించారు. డీలక్స్‌ బస్సు ప్రయాణికులకు నెలవారీ సీజన్‌ టికెట్‌ తీసుకునే సౌకర్యం కల్పించారు. అదే విధంగా పల్లె వెలుగు నెలవారీ సీజన్‌ టికెట్‌ తీసుకున్న ప్రయాణికులు రూ.20 చెల్లించి ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో, ఎక్స్‌ప్రెస్‌ నెలవారీ సీజన్‌ టికెట్‌ తీసుకున్న వారు రూ.20 అదనంగా చెల్లించి డీలక్స్‌ బస్సులో ప్రయాణించవచ్చు. అదే విధంగా రెండు నెలల కాల పరిమితికి టికెట్‌ తీసుకున్న వారు అదనంగా 5 రోజులు, మూడు నెలల పరిమితి టికెట్‌ తీసుకున్న వారు అదనంగా పది రోజులు ప్రయాణించవచ్చు. మహిళలకు ఎక్స్‌ప్రెస్‌ వరకు ఉచిత ప్రయాణం ఉండగా, డీలక్స్‌ సర్వీసులో 15 రోజుల చార్జీలు చెల్లించి నెల పరిమితి కలిగిన సీజన్‌ టికెట్‌ తీసుకునే ప్రయోజనం ఆర్టీసీ కల్పించింది.

ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి

ఆర్టీసీ ప్రవేశ పెట్టిన నెలవారీ సీజన్‌ టికెట్‌ ప్రయోజనాలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి. 9 రకాల ప్రయోజనాలు కల్పించింది. టోల్‌ చార్జీలపై రాయితీ అందిస్తోంది. టికెట్‌ తీసుకున్న రూట్లలో కాకుండా ఇతర రూట్లలో ప్రయాణించే వెసులుబాటు ఉంది.

– భూక్య ధరంసింగ్‌,

డీఎం ఆర్టీసీ హనుమకొండ డిపో

మంత్లీ సీజన్‌ టికెట్‌తో

బహుళ ప్రయోజనాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement