కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

Nov 14 2026 1:23 AM | Updated on Nov 14 2026 1:23 AM

గణపురం : రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం మండలంలోని అప్పయ్యపల్లి, సీతారాంపురం, కొండాపూర్‌, జంగుపల్లి, పరుశరాంపల్లి, బస్వరాజుపల్లి గ్రామాల్లో పీఏసీఎస్‌, ఐకేపీల ఆధ్వర్యంలో ధర్మరావుపేటలో శ్రీసాయి మిత్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధా న్యం విక్రయించి ప్రభుత్వం కల్పించిన మద్దతు దరతో పాటు బోసస్‌ పొందాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. రైతులను ఇబ్బంది పెట్టే రైసు మిల్లర్లను ఉపేక్షించేది లేదన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రాజేశ్వర్‌ రావు, ఎంపీడీఓ భాస్కర్‌, ఏఓ ఐలయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు.

చెక్కుల పంపిణీ

23 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే సత్యనారాయణ రావు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధి కారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement