కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం పునర్నిర్మాణ పనులను ఎండోమెంట్ స్పెషల్ డీఈ శ్రీనివాస్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విజయగణపతి, ప్రధాన ఆలయం, రామాలయం, సరస్వతీ, శుభానందదేవి, శ్రీసుబ్రహ్మణ్యసామి ఆలయాల పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనుల వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని పేర్కొన్నారు. ‘ఆదేశించినా..సాగట్లే’ అనే శీర్షికన సాక్షిలో శనివారం వచ్చిన కథనంపై ఆర్అండ్బీ, ఎండోమెంట్శాఖ ఉన్నతాధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. దేవాదాయశాఖ ఉద్యోగులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. జిల్లా యంత్రాంగం కూడా కథనంపై ఆరాతీసినట్లు తెలిసింది.


