మల్హర్(కాటారం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో భాగంగా నేడు(ఆదివారం) మండలం మేడిపల్లి గ్రామంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొననున్నారు. మేడిపల్లి గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి మంత్రి దీపావళి వేడుకలను జరుపుకోనున్నారు. లబ్ధిదారుల ఇంట్లోనే దీపాలు వెలిగించి, వారి ఆనందంలో పాలుపంచుకోనున్నారు.
ఎస్పీ అభినందనలు
భూపాలపల్లి: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి తక్షణ సాయం అందించి కాపాడిన బ్లూ కోల్డ్స్ సిబ్బందిని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అభినందించారు. శుక్రవారం మధ్యాహ్నం గణపురం మండలం నగరంపల్లి గ్రామానికి చెందిన గుట్టం శ్రీనివాస్ మూర్చ కారణంగా అపస్మారక స్థితికి వెళ్లాడు. స్థానికులు డయల్ 112కు సమాచారం అందించగా కానిస్టేబుల్ మోహన్, హోంగార్డు రాకేశ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడికి ప్రథమ చికిత్స అందించారు. ఇందుకు గాను మోహన్, రాకేశ్‌లను ఎస్పీ సంకీర్త్ శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో అభినందించి క్యాష్ రివార్డు అందించారు.
శనిత్రయోదశికి భక్తుల రద్దీ
కాళేశ్వరం: శని త్రయోదశిని పురస్కరించుకొని కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం బాలాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నవగ్రహాల వద్ద శనిపూజలు, శ్రీసుబ్రహ్మణ్యస్వామికి కాలసర్ప నివారణ పూజలు, ఆదిముక్తీశ్వరాలయంలో అభిషేకాలు నిర్వహించినట్లు ఈఓ మహేశ్ తెలిపారు. పూజలు, లడ్డు, ప్రసాదాలపై రూ.1.60లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ పేర్కొన్నారు.
వైద్య కళాశాలకు
12 పీజీ సీట్లు
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు 12 పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) సీట్లు మంజూరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ), మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ద్వారా మూడు విభాగాల్లో ఈ సీట్లు కేటాయించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్‌రావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంజూరైన సీట్లలో ఎండీ జనరల్ మెడిసిన్‌కు నాలుగు, ఎంఎస్ ప్రసూతి, సీ్త్ర వ్యాధుల విభాగానికి నాలుగు, ఎంఎస్ ఆర్థోపెడిక్స్‌కు నాలుగు సీట్లు ఉన్నాయి. పీడియాట్రిక్స్ విభాగంలోనూ పీజీ సీట్లు మంజూరయ్యే అవకాశం ఉందని, ఇందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఎమ్మెల్యే ప్రోత్సాహం, కలెక్టర్ ప్రత్యేక చొరవతో పీజీ సీట్లు దక్కాయని పేర్కొన్నారు. ఈ సీట్ల మంజూరుతో జిల్లాలో వైద్య విద్య మరింత అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక విద్యార్థులకు ఉన్నత వైద్య విద్య అభ్యసించే అవకాశం లభించనుంది. భవిష్యత్‌లో జిల్లాలో నిపుణులైన వైద్యుల సంఖ్య పెరిగి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఘనంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫౌండేషన్ డే
భూపాలపల్లి అర్బన్: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 77వ ఫౌండేషన్ డే వేడుకలను భూపాలపల్లి ఏరియాలోని సుభాష్ కాలనీ స్కౌట్ డెన్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. బీఎస్‌జీ సింగరేణి డిస్టిక్ర్ట్ అసోసియేషన్ భూపాలపల్లి ఏరియా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు హెడ్‌క్వార్టర్స్ కమిషనర్, పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యామ్ సుందర్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొని మతసామరస్యం, శాంతి, సోదరభావం, మానవత్వం ప్రాముఖ్యతను చాటిచెప్పారు. ఈ సందర్భంగా శ్యామ్ సుందర్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, సేవాభావాన్ని పెంపొందించడంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సమాజసేవలోనూ ముందుండాలన్నారు. ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతతో సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.


