శుక్రవారం శ్రీ 6 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 6 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

Nov 6 2026 1:26 AM | Updated on Nov 6 2026 1:26 AM

– IIలోu

న్యూస్‌రీల్‌

ప్రీ ప్రైమరీ టీచర్ల నియామకం ఎప్పుడో..

భూపాలపల్లి అర్బన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యను బలోపేతం చేసి, చిన్నారులకు పునాది స్థాయి నుంచే నాణ్యమైన విద్య అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతోంది. ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణ కోసం ఉపాధ్యాయులు, ఆయాలను నియమించా ల్సి ఉన్నప్పటికీ, ఆ ప్రక్రియ కాగితాలకే పరిమితమై ంది. జూన్‌ నెలలోనే టీచర్ల నియామకానికి దరఖా స్తులు స్వీకరించిన అధికారులు.. పాఠశాలలు ప్రారంభమై ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు నియామకాలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.

41 పాఠశాలలు ఎంపిక..

జిల్లాలో 281 ప్రాథమిక పాఠశాలలు ఉండగా.. గతేడాది విద్యా సంవత్సరంలో 55, ఈ ఏడాది రెండో విడత ప్రీ ప్రైమరీ విద్య అమలు కోసం మరో 41 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు సైతం జారీఅయ్యాయి. నియామకాల కోసం దరఖాస్తుల స్వీకరణ కూడా పూర్తయింది. అయినప్పటికీ తదుపరి చర్యలు తీసుకోవడంలో జిల్లా విద్యాశాఖ అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయులను నియమించాల్సి ఉండగా, సగం విద్యా సంవత్సరం గడిచినా పట్టించుకోకపోవడం విద్యాశాఖ పనితీరుకు అద్దం పడుతోంది.

ఉపాధ్యాయులపై అదనపు భారం

ప్రీ ప్రైమరీ తరగతలు ప్రారంభం అవుతున్నాయని జిల్లాలో గతేడాది, ప్రస్తుతం సుమారు 1200 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. వారికి ప్రత్యేకంగా బోధించేందుకు ఉపాధ్యాయులు లేకపోవడంతో ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లపైనే అదనపు భారం పడుతోంది. ప్రాథమిక తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించడంతోపాటు చిన్నారుల సంరక్షణ, అక్షరాభ్యాసం, ఆటపాటల ద్వారా నేర్పించే బాధ్యతలను కూడా నిర్వహించాల్సి వస్తోంది. దీంతో విద్యాబోధనపై ప్రభావం పడటంతోపాటు చిన్నారులకు అందాల్సిన ప్రత్యేక శ్రద్ధ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రైవేట్‌ పాఠశాలల వైపు..

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య అందుబాటులో ఉంటుందన్న ఆశతో తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపిన తల్లిదండ్రులకు టీచర్ల కొరత నిరాశ కలిగిస్తోంది. సకాలంలో నియామకాలు చేపట్టకపోవడంతో కొందరు తల్లిదండ్రులు ప్రత్యామ్నాయంగా ప్రైవేట్‌ పాఠశాలలను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు నాణ్యమైన పునాది విద్య అందించాలన్న లక్ష్యం నెరవేరకపోగా, విద్యార్థులను ప్రైవేట్‌ పాఠశాలల వైపు మళ్లించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

గతేడాది కూడా ఇదే పరిస్థితి..

గత విద్యా సంవత్సరంలోనూ ప్రీ ప్రైమరీ టీచర్ల నియామకాల విషయంలో ఇదే తరహా నిర్లక్ష్యం చోటుచేసుకున్నాయి. ఏడాది తరువాత నియామకాలు చేపట్టారు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అధికారులు ఈ ఏడాది కూడా అదే జాప్యాన్ని కొనసాగించడం గమనార్హం. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుని, పాఠశాలలను ఎంపిక చేసి, దరఖాస్తులు స్వీకరించిన తర్వాత కూడా నియామకాలు పూర్తి చేయకపోవడం వెనుక కారణాలేమిటో అంతుచిక్కడం లేదు.

జూన్‌లోనే దరఖాస్తుల స్వీకరణ

ఐదు నెలలవుతున్నా పట్టించుకోని అధికారులు

గతేడాది కూడా ఇదే నిర్లక్ష్యం..

విద్యాబోధనపై ప్రభావం

ఎమ్మెల్యే, కలెక్టర్‌ చొరవ చూపితే పరిష్కారం

ఎమ్మెల్యే, కలెక్టర్‌ స్పందిస్తే..

జిల్లాలో విద్యారంగ సమస్యలపై పర్యవేక్షించాల్సిన జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రీ ప్రైమరీ టీచర్ల నియామకాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్‌ సైతం ఈ సమస్యపై దృష్టి సారించి నియామకాలు పూర్తిచేయించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన చిన్నారులకు ఉపాధ్యాయులను అందించలేని పరిస్థితి ఉంటే ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టినా ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై జిల్లా ఇన్‌చార్జ్‌ విద్యాశాఖ అధికారి లలితను వివరణ కోరేందుకు ఫోన్‌లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement