యాసంగి ఇరకాటమే.. | - | Sakshi
Sakshi News home page

యాసంగి ఇరకాటమే..

Nov 6 2026 1:26 AM | Updated on Nov 6 2026 1:26 AM

భూపాలపల్లి రూరల్‌: ఈ సారి యాసంగి సాగు రైతన్నకు ఇరకాటంగా పరిగణించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎల్‌నినో ప్రభావంతో సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఆప్రమత్తమైంది. అరుతడి పంటలే శ్రేయస్కరమని చెబుతోంది. నీటి వసతి ఉంటేనే సాగు చేయాలని స్పష్టం చేస్తోంది. అలా కాదని సాధారణ సాగుకు వెళ్తే రిస్క్‌ను భరించేందుకు సిద్ధంగా ఉండాలంటోంది. యాసంగిలో జిల్లాలో వరి సాగు మొదటి స్థానంలో, మొక్కజొన్న రెండవ స్థానంలో ఉంటుంది. ఆరుతడి పంటల సాగు స్వల్పంగా ఉంటుంది. ఎల్‌నినో కారణంగా వ్యవసాయ శాఖ అధికారులు శనగ, నువ్వులు, మినుములు, పెసర్లు సాగు చేయాలని స్పష్టం చేస్తున్నారు. వరి, జొన్న, మొక్కజొన్న అసలుకే చేయవద్దంటున్నారు.

ఆరుతడి పంటలకు మార్కెట్‌,

మద్దతు ధర లభిస్తుందా?.

వరి, మొక్కజొన్నలకు బదులుగా మినుములు, కందులు, ఇతర చిరుధాన్యాలు ఉద్యాన పంటలు, కూరగాయలు, సాగు చేయాలని వ్యవసాయశాఖ సూచిస్తోంది. వీటి సాగు ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఆశించవచ్చని ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ వానాకాలం పంటలో ఈ ఏడాది జిల్లాలో పెసర 8,352 ఎకరాల్లో సాగు చేశారు. అందుబాటులో మార్కెట్‌ సరిగా లేకపోవడంతో పండిన పంట పెసరలను రైతులు గ్రామాల్లో తిరుగుతూ.. రిటేల్‌గా అమ్ముకున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ సారి ఆరుతడి పంటలు పండిన తర్వాత మార్కెట్‌ ఏర్పాటు చేసికొంటారా? లేదా? మద్దతు ధర లభిస్తుందో లేదోనని రైతులు అయోమయానికి గురవుతున్నారు. రైతులకు మార్కెట్‌ సౌకర్యంతో పాటు మద్దతు ధరపై స్పష్టత ఇస్తే రైతులు ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపే అవకాశం ఉంది.

అడుగంటుతున్న భూగర్భ జలాలు

ఎల్‌నినో సంక్షోభం నేపథ్యంలో

అప్రమత్తం

ఆరుతడి పంటలే శ్రేయస్కరమంటున్న ప్రభుత్వం

అడుగంటుతున్న భూగర్భజలాలు

జిల్లాలో చెరువులు పూర్తిగా ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు పడిపోతున్నాయి. జిల్లాలోని గణపురం, భీం ఘన్‌పూర్‌, బొగ్గులవాగు చెరువుల్లో కొంత నీటి సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో జలాలు అరుగంటిపోయే పరిస్థితులు లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నీటి విడుదలపై రైతులు భరోసా పెట్టుకోవద్దని ప్రభుత్వం తేల్చి చెబుతోంది.

ముందస్తుగా ధర ప్రకటించాలి..

ఎల్‌నినో ప్రభావం ఉన్న తరుణంలో ప్రభుత్వం ఆరుతడి పంటలకు ముందస్తుగానే మద్దతు ధర ప్రకటించాలి. రైతులకు అందుబాటులో మార్కెట్‌ ఏర్పాటు చేయాలి. రైతులకు నష్టం రాకుండా భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

– కర్నాటకపు సమ్మయ్య,

రైతు స్వరాజ్య వేదిక జిల్లా కన్వీనర్‌

ఆరుతడి పంటలు వేయాలి

ఆరుతడి పంటలకు సంబంధించిన విత్తనాలు కొంతమే ర డీలర్ల వద్ద ఉన్నాయి. డిసె ంబర్‌ చివరి వరకు కోతలు ఉండనున్నాయి. డిమాండ్‌ మేర విత్తనాలు, ఎరువులు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఆరుతడి పంటలు సాగుచేయాలి.

– జాడి బాబురావు,

జిల్లా వ్యవసాయశాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement