తాగునీటి కొరత రానివ్వొద్దు | - | Sakshi
Sakshi News home page

తాగునీటి కొరత రానివ్వొద్దు

Nov 6 2026 1:26 AM | Updated on Nov 6 2026 1:26 AM

భూపాలపల్లి: ప్రజలకు తాగునీటి కొరత తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ ఆదేశించారు. తాగునీరు, జలసిరి పాం పాండ్స్‌, పర్క్యూలేషన్‌ ట్యాంకులు, ఇంకుడు గుంతలు నిర్మాణం, వీబీజీ రాంజీ పథకానికి లేబర్‌ మొబలైజేషన్‌, పశువుల మేత, ఆరోగ్య చర్యలు తదితర అంశాలపై గురువారం ఐడీఓసీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. నీటి సరఫరాలో సమస్యలు తలెత్తే గ్రామాలను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. పశువుల సంరక్షణ కూడా చాలా ముఖ్యమని.. మేత కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, డీఆర్‌డీఓ బాలకృష్ణ, డీపీఓ శ్రీలత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

17న జిల్లాస్థాయి యువజనోత్సవాలు

యువతలోని సృజనాత్మకత, కళా నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు ఈ నెల 17న జిల్లా కేంద్రంలోని ఇల్లంద్‌ క్లబ్‌హాల్‌లో జిల్లా స్థాయి యువజనోత్సవాలు, వికసిత్‌ భారత్‌ యువ నాయకుల సంభాషణ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 15నుంచి 29ఏళ్ల వయస్సు గల యువతీ యువకులు అర్హులని చెప్పారు. మై భారత్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి అని తెలిపారు. ఆసక్తి గలవారు ఆధార్‌ జిరాక్స్‌, రిజిస్ట్రేషన్‌ ప్రింట్‌అవుట్‌, రెండు ఫొటోలతో పోటీలకు హాజరుకావాలని కోరారు. వివరాలకు జిల్లా యువజన, క్రీడల అధికారి సీహెచ్‌ రఘు 96180 11096ను సంప్రదించాలని సూచించారు.

ఓటరు నమోదుకు నేడే చివరి గడువు..

శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితాలో పేర్ల నమోదు నేటితో ముగుస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తెలిపారు. అర్హులైన వారు గడువు ముగిసేలోగా ఫారం–18 ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని కోరారు.

దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించాలి..

శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి అందిన దరఖాస్తులను నిర్దేశిత మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సర్‌ 2026, శాసన మండలి పట్టభద్రుల ఓటరు నమోదు తదితర అంశాలపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశానికి ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాహుల్‌ శర్మ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ హరికృష్ణ, ఎన్నికల విభాగం తహసీల్దార్‌ విజయలక్ష్మి, డీటీ అబ్బాస్‌ పాల్గొన్నారు.

భూ రీ సర్వేతో శాశ్వత పరిష్కారం

రేగొండ: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్న భూ రీ సర్వేతో రైతుల భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ రాహుల్‌శర్మ అన్నారు. గురువారం మండలంలోని పోచంపల్లిలో కొనసాగుతున్న భూ రీ సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్‌లో భూవివాదా లకు తావులేకుండా రీ సర్వేను సమగ్రంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో రబీలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అశోక్‌ కుమార్‌, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ కుసుమ కుమారి, తహసీల్దార్‌ శ్వేత, సర్పంచ్‌ సబిత, సర్వే సిబ్బంది, రైతులు, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.

నేటితో ముగియనున్న ఓటరు నమోదు

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement