భూపాలపల్లి అర్బన్: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, వారికి కల్పిస్తున్న సౌకర్యాలను అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరత్నంను వైద్యసేవలు, ఓపీ సేవలు, రోగులకు సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జనరల్ మెడిసిన్ విభాగానికి వెళ్లి అక్కడి వైద్యుడి వద్ద సాధారణ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలిస్తూ వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.


