‘బుడా’ ఏర్పాటు ఇంకెప్పుడు? | - | Sakshi
Sakshi News home page

‘బుడా’ ఏర్పాటు ఇంకెప్పుడు?

Nov 5 2026 12:46 AM | Updated on Nov 5 2026 12:46 AM

Simultaneously Printed at Warangal | Hyderabad | Bangalore | chennai | Delhi | Mumbai | Anantapur | Guntur | Kadapa | Khammam | Karimnagar | Kurnool | Mahaboobnagar | Mangalagiri | Nalgonda | Nellore | Nizamabad | Ongole | rajamahendravaram | Srikakulam | Tadepalli Gudem | Tirupathi | Vijayawada | Visakhapatnam

న్యూస్‌రీల్‌

విద్యా ప్రమాణాలను

పెంపొందించాలి

మల్హర్‌(కాటారం): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచి, ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులందరూ సమష్టిగా కృషి చేయాలని జిల్లా అకడమిక్‌ ప్యానెల్‌ ఇన్‌స్పెక్షన్‌ టీం సభ్యుడు అనపర్తి తిరుపతి పిలుపునిచ్చారు. మండలంలోని చింతకాని కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయురాలు ఎస్‌.శైలజ అధ్యక్షతన కాంప్లెక్స్‌ స్థాయి ఉపాధ్యాయుల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి హాజరై విద్యాపరమైన సూచనలు చేశారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు చదవడం, రాయడం, గణితంలో నైపుణ్యాలు పెంపొందించాలని, ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమాన్ని ప్రతీ పాఠశాలలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. బోధనలో వినూత్న పద్ధతులు, టీఎల్‌ఎం వినియోగం, విద్యార్థుల భాగస్వామ్యంతో కూడిన అభ్యసనకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం ఒక్కరి బాధ్యత కాదని, సమష్టి కృషితోనే సాధ్యమని వివరించారు. సమావేశంలో రిసోర్స్‌ పర్సన్స్‌ ఎన్‌.సత్యనారాయణ, వేణుగోపాల్‌, పరమేశ్వర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

భూపాలపల్లి: బొగ్గు గనులు, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలతో పారిశ్రామికంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న భూపాలపల్లి జిల్లా కేంద్రాన్ని సకల సదుపాయాలతో ముస్తాబు చేసేందుకు తలపెట్టిన భూపాలపల్లి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (బుడా) ఏర్పాటు ప్రతిపాదనలు మూలనపడ్డాయి. జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం 2024 సెప్టెంబర్‌లో బుడా ఏర్పాటుకు హడావుడి చేసినప్పటికీ, ఇప్పటివరకు ఆచరణలో ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంపై స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

కాగితాలకే పరిమితమైన మ్యాప్‌లు..

జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాను ప్రామాణికంగా తీసుకొని నాలుగు వైపులా 15 కిలోమీటర్ల పరిధిని బుడా కిందికి తీసుకురావాలని అధికారులు భావించారు. ఈ మేరకు భూపాలపల్లి మున్సిపాలిటీతో పాటు మల్హర్‌, గణపురం, కాటారం మండలాల్లోని బస్వాపూర్‌, రాంపూర్‌, గొర్లవీడు, పెద్దాపూర్‌, కొత్తపల్లి, ఆన్‌సాన్‌పల్లి, చెల్పూరు, గాంధీనగర్‌ క్రాస్‌రోడ్డు వరకు గ్రామాలను ఇందులో విలీనం చేసి మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనకు మున్సిపల్‌ అధికారులు అంతా సిద్ధం చేశారు. సర్వేలు, మ్యాప్‌ల రూపకల్పన, గెజిట్‌ నోటిఫికేషన్‌, ప్రజాభిప్రాయ సేకరణ అంటూ అప్పట్లో హడావుడి చేసి ఆ తర్వాత ఆ ప్రక్రియను పూర్తిగా పక్కన పడేశారు.

బుడా ఏర్పడితే మరిన్ని నిధులు

బుడా ఏర్పడితే రాబోయే 25 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు రాబట్టుకునే అవకాశం ఉంది. ప్రధాన జంక్షన్ల విస్తరణ, రిక్రియేషన్‌ పార్కులు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు, ప్రాంతీయ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా టూరిజం ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం మున్సిపాలిటీలో జీ ప్లస్‌ –2 వరకే అనుమతులు లభిస్తుండగా, అంతకంటే ఎక్కువ అంతస్తుల నిర్మాణానికి వరంగల్‌ కుడా (కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) చుట్టూ తిరగాల్సి వస్తోంది. బుడా అందుబాటులోకి వస్తే స్థానికంగానే జీ ప్లస్‌ –5 వరకు అనుమతులు పొందే వెసులుబాటు ఉంటుంది.

మారనున్న భూపాలపల్లి ముఖచిత్రం

బుడా ఏర్పడితే రియల్‌ ఎస్టేట్‌ మోసాలకు చెక్‌ పెడుతూ అతి తక్కువ ధరలకే ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్లాట్లు ప్రజలకు అందుతాయి. రెండేళ్ల క్రితం ప్రచారంలోకి వచ్చిన ఈ ప్రతిపాదనలు నేటికీ ఆచరణకు నోచుకోకపోవడంతో కోల్‌బెల్ట్‌ ప్రాంత సమగ్ర అభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, భూపాలపల్లి జిల్లా కేంద్రంగా బుడా ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రత్యేక నిధులు కేటాయించి ఈ ప్రాంత ముఖచిత్రాన్ని మార్చాలని, అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నాయి.

భూపాలపల్లి పట్టణ వ్యూ

రెండేళ్లుగా భూపాలపల్లి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటులో జాప్యం

15 కిలోమీటర్ల పరిధితో మాస్టర్‌ ప్లాన్‌

గెజిట్‌ ప్రకటన కాగితాలకే పరిమితం

నిలిచిపోయిన ప్రతిపాదనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement